📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Donald Trump: ఒక్క దెబ్బకు 48 మంది ఇరాన్ నేతలు హతం

Author Icon By Aanusha
Updated: March 1, 2026 • 11:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Donald Trump: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో ఇరాన్ కీలక నేతలు హతమైనట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. “ఒక్క దెబ్బకు 48 మంది ఇరాన్ అగ్రనేతలను లేపేశాం.. ఇది మాకు అద్భుత విజయం” అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటన చేశారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. మార్చి 1 నాటికి పరిస్థితి చేజారిపోయి, పూర్తిస్థాయి యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ఇరాన్ గుండెల్లో గుబులు రేపింది.

Read Also: Iran-Israel War : ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లుతున్న ఇరాన్

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ: టెహ్రాన్ నడిబొడ్డున విధ్వంసం

ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడం ఇరాన్ చరిత్రలోనే అతిపెద్ద విషాదంగా మారింది.టెహ్రాన్ నడిబొడ్డున అమెరికా, ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. దాదాపు 1,200కు పైగా బాంబులు, ఆయుధ సామగ్రితో ఇరాన్‌పై దాడి చేశాయి. ఈ విధ్వంసంలో ఇరాన్ అగ్రనాయకత్వం కుప్పకూలింది.

Donald Trump: 48 Iranian leaders killed in one strike

ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ దాడి తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. ఇరాన్ ఒకవేళ ప్రతీకారానికి దిగితే, ఇంతకంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఇది తమ ఉనికి కోసం జరుగుతున్న యుద్ధమని, దాడులను మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Iran Leaders Killed Middle East War Operation Epic Fury Trump vs Iran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.