📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Dog: 1500 కిమీ ప్రయాణించి యజమాని వద్దకు చేరిన శునకం

Author Icon By Pooja
Updated: November 23, 2025 • 3:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చైనాలో ఓ పెంపుడు లాబ్రడార్ శునకం(Dog) సుమారు మూడు నెలలు కనిపించకుండా పోయి, దాదాపు 1500 కిలోమీటర్లు ప్రయాణించి తన యజమాని చెంతకు తిరిగి చేరిన సంఘటన అందరినీ కదిలిస్తోంది.

Read Also: Piracy: ఐబొమ్మ క్లోజ్ అయినా… దేశలో పైరసీ ఉధృతి ఆగలేదు

Dog

ఎలా తప్పిపోయింది?
తూర్పు చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న కింగ్‌డావో బీచ్(Qingdao Beach) వద్ద గావో అనే మహిళ పెంచుకుంటున్న ‘సెప్టెంబర్’ అనే శునకం(Dog) ఆగస్టు 13న అదృశ్యమైంది. బీర్ ఫెస్టివల్ సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా, అది మరో కుక్క వెంట వెళ్లిపోతున్నట్లు కనిపించింది. అనేక జంతు సంరక్షణ కేంద్రాలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లలో గాలించినా శునకం కనబడకపోవడంతో గావో నిరాశ చెందింది.

చాంగ్షాలో గుర్తించిన ఝౌ
సుమారు మూడు నెలల తర్వాత, కింగ్‌డావోకు సుమారు 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాంగ్షా నగరంలో భారీ వర్షంలో తడుస్తూ తిరుగుతున్న సెప్టెంబర్‌ను ఝౌ అనే మహిళ గమనించింది. ఆమె దాన్ని ఇంటికి తీసుకెళ్లి, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలు గావో దృష్టికి రావడంతో వెంటనే ఆమె ఝౌను సంప్రదించారు.

ఎమోషనల్ రీయూనియన్
ఈ నెల 8న, పెట్ రిలోకేషన్ సర్వీస్ సహాయంతో సెప్టెంబర్‌ను గావో వద్దకు తీసుకువచ్చారు. యజమానిని చూసిన క్షణంలో శునకం ఆనందంతో ఆమెపై దూకి, కన్నీళ్లు పెట్టుకోవడం అందరిని భావోద్వేగానికి గురిచేసింది. ఎవరో పర్యాటకులు దాన్ని తమతో తీసుకెళ్లి ఉండవచ్చు. చాలా కష్టాలు పడినా తిరిగి వచ్చిందంటే నిజంగా అద్భుతమే,” అని గావో తెలిపారు.తప్పిపోయిన మూడు నెలల్లో సెప్టెంబర్ మరింత చురుకుగా మారడం ఆమెను ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలో ఈ కథ నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

ChinaViral Google News in Telugu Latest News in Telugu ViralNews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.