📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Air India Plane Crash: మృతుల గుర్తింపులో డీఎన్‌ఏ పరీక్షలే ఆధారం!

Author Icon By Shobha Rani
Updated: June 20, 2025 • 2:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అహ్మదాబాద్‌(Ahmedabad) లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 270 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగి వారం రోజులు కావస్తున్నా మృతుల గుర్తింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. మృతదేహాలు చాలా వరకు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో అధికారులకు ఇది పెద్ద సవాలుగా మారింది.
సివిల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాకేశ్ జోషి ప్రకారం
ఈ విషయంపై అహ్మదాబాద్ (Ahmedabad) సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాకేశ్ జోషి మాట్లాడుతూ, డీఎన్‌ఏ నమూనాల పరీక్షల ద్వారా ఇప్పటివరకు 215 మంది మృతులను గుర్తించినట్లు శుక్రవారం తెలిపారు. వీరిలో 198 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని ఆయన వెల్లడించారు. మిగిలిన మృతదేహాల గుర్తింపు ప్రక్రియ, అప్పగింతలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
గుర్తింపు ఆలస్యం – కారణాలు
ప్రమాద తీవ్రత కారణంగా మృతదేహాలు ఛిద్రమై, తీవ్రంగా కాలిపోవడంతో వాటిని గుర్తించడం కష్టతరంగా మారిందని వైద్యులు చెబుతున్నారు. దీంతో మృతుల ఎముకలలోని కణజాలం నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాల్సి వస్తోందని, ఈ ప్రక్రియ సంక్లిష్టమైనది కావడంతో గుర్తింపు ప్రక్రియ ఆలస్యమవుతోందని ఆయ‌న‌ వివరించారు.
ల్యాబ్ అధికారులు – నిరంతర శ్రమ
అహ్మదాబాద్‌(Ahmedabad) లోని డీఎన్‌ఏ ప్రయోగశాల సిబ్బంది ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి 24 గంటలూ నిర్విరామంగా పనిచేస్తున్నారు. మిగిలిన మృతులను కూడా త్వరితగతిన గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.

Air India Plane Crash: మృతుల గుర్తింపులో డీఎన్‌ఏ పరీక్షలే ఆధారం!

అదనపు చర్యలు – కుటుంబాల సహకారం
Gujarat ప్రభుత్వం తరపున BJ మెడికల్‌ కాలేజీలో ప్రత్యేక DNA సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు. కుటుంబీకులను పునరుత్తేజపరచటం, వెంటనే DNA నమూనాలు సమర్పించాలని అధికారుల విజ్ఞప్తి. NTSB (అమెరికా), FAA సహా అనేక అంతర్జాతీయ సంస్థలు విచారణలో పాల్గొని సహకారం ఇవ్వడం ద్వారా, DNA గుర్తింపు ప్రక్రియను సమర్థంగా పూర్తి చేస్తోంది.

Read Also: Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదం – UAE డాక్టర్‌ భారీ విరాళం

AirIndia171 DNA tests are the basis for ForensicDNA identifying the dead! VictimIdentification

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.