అమెరికా (US) చరిత్రలోనే అత్యంత పెద్ద ఎత్తున ఫెడరల్ ఉద్యోగులను తొలగించే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ప్రారంభించిన డిఫర్డ్ రిజిగ్నేషన్ ప్రోగ్రామ్ (DRP) అమల్లోకి రావడంతో, లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ భవిష్యత్తుపై అనిశ్చితిలో ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ కింద ఇప్పటికే అన్ని ఎంప్లాయిస్‌కి నోటీసులు, ఈమెయిల్స్ పంపి, విధించిన గడువు నిన్నటితో ముగిసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Avika Gor : పెళ్లి చేసుకున్న ‘చిన్నారి పెళ్లికూతురు’
ఈ గడువు ముగిసిన నేపథ్యంలో, దాదాపు లక్ష మంది ఉద్యోగులు తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేయనున్నట్లు అంచనా. ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించడంతో, ఫెడరల్ సర్వీసులలో భారీ స్థాయిలో ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది. కొంతమంది ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామాలు సమర్పించినా, మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా పరిపాలనా రంగంలో తీవ్ర ప్రభావం పడనుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ట్రంప్ ఈ నిర్ణయంతో అమెరికాకు ఏటా సుమారు 28 బిలియన్ల డాలర్ల ఆదా జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించడమే ఈ చర్య వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ఆయన వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, పెద్ద ఎత్తున ఫెడరల్ ఉద్యోగుల తొలగింపులు సేవా ప్రమాణాలను దెబ్బతీయవచ్చనే భయం వ్యక్తమవుతోంది. దీనివల్ల దేశవ్యాప్తంగా మౌలిక వసతులు, ప్రజా సేవలు మందగించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా ఈ చర్య అమెరికా పరిపాలనపై దీర్ఘకాలిక ప్రభావం చూపనుంది.