📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Flight Services:ఇక ఆ దేశానికి డైరెక్ట్ విమాన సర్వీసులు

Author Icon By Pooja
Updated: October 3, 2025 • 11:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ నెలాఖరు ఇరుదేశాల మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు భారత్, చైనాలు అంగీకరించాయని విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఇఎ) నిన్న ప్రకటించింది. భారత్, చైనాలలో నియమించిన పాయింట్లను అనుసంధానించే ప్రత్యక్ష విమాన సర్వీసులు 2025 అక్టోబరు చివరి నాటికి తిరిగి ప్రారంభం అవుతాయి. రెండు దేశాల నుండి నియమించిన క్యారియర్ ల వాణిజ్య నిర్ణయం, అన్ని కార్యాచరణ ప్రమాణాల నెరవేర్పుకు లోబడి ఉంటుంది అని ఎంఇఎ(MEA) ఒక ప్రకటనతో తెలిపింది.

Read Also: Nagarjuna sagar: శ్రీశైలం-సాగర్ గేట్లు తెరుచుకున్నాయి

రెండుదేశాల మధ్య చిగురిస్తున్న స్నేహబంధం

ఈ సంవత్సరం ప్రారంభం నుంచి భారత్, చైనా మధ్య సంబంధాలను క్రమంగా సాధారణీకరించే దిశగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో భాగంగా, రెండు దేశాల పౌరవిమానయాన(Civil aviation) అధికారులు రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సేవలను తిరిగి ప్రారంభించడం, సవరించిన విమాన సేవల ఒప్పందంపై సాంకేతిక స్థాయి చర్చలలో నిమ్నగమై ఉన్నారని ఎంఇఎ తెలిపింది. పౌర విమానయాన అధికారుల ఈ ఒప్పందం భారత్, చైనా మధ్య ప్రజల మధ్య సంబంధాన్ని మరింత సులభతరం చేస్తుంది. ద్వైపాక్షిక మార్పిడులను క్రమంగా సాధారణీకరించేడానికి దోహదపడుతుంది.

మెరుగు అవుతున్న ద్వైపాక్షిక సంబంధాలు

గత ఏడాది కాలంగా ద్వైపాక్షిక సంబంధాలలో క్రమంగా మెరుగుదల వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2024 చివరలో డెప్సాంగ్, డెమ్చోక్ వద్ద వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఎలసి) వెంబడి విరమణ ప్రక్రియతో ప్రారంభించి, రెండు దేశాలు సంబంధాలను స్థిరీకరించడానికి విశ్వాసాన్ని పెంపొందించే చర్యల శ్రేణిని అమలు చేశాయి. ఇండిగో ఆక్టోబర్ 26 నుండి భారత్-చైనా డెరెక్ట్ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించనుంది.

భారత్–చైనా మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులు ఎప్పటి నుంచి పునఃప్రారంభం అవుతున్నాయి?
2025 అక్టోబరు చివరి నాటికి భారత్–చైనా మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి.

ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?
రెండు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో ప్రజల మధ్య సంబంధాలను సులభతరం చేయడం, ద్వైపాక్షిక మార్పిడులను ప్రోత్సహించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Direct Flights India China Google News in Telugu India China Relations India-China Flights Indigo Airlines Latest News in Telugu MEA Announcement Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.