📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Nepal-India: ప్రారంభమైన ఇరు దేశాల మధ్య డైరెక్ట్ బస్సు

Author Icon By Vanipushpa
Updated: February 5, 2026 • 4:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియా- నేపాల్ (Nepal)మధ్య డైరెక్ట్ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ బస్సు భారతదేశ రాజధాని న్యూఢిల్లీ నుండి నేపాల్‌లోని బేనీ మున్సిపాలిటీ వరకు నడుస్తుంది. ఢిల్లీ నుండి బేనీకి చేరుకోవడానికి సుమారు 27 గంటల సమయం పడుతుంది. మొత్తం ప్రయాణ దూరం 1,400 కిలోమీటర్లు. ఇది టూరిస్టులకు మంచి అవకాశం. హిందూ, బౌద్ధమతస్థులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ముక్తినాథ్. ఇప్పటివరకు అక్కడికి వెళ్లాలంటే విమానాలు లేదా మల్టీ-లెగ్ ప్రయాణాలతో భక్తులు ఎంతో ఇబ్బంది పడేవారు. ఈ సమస్యకు పరిష్కారంగా భారత్-నేపాల్ సరిహద్దుల మధ్య ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి నేపాల్-భారత్ ఫ్రెండ్షిప్ బస్సు సర్వీసు ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య రైల్వే ప్రయాణాలు జరుగుతున్నప్పటికీ డైరెక్ట్ బస్సు సర్వీస్ ఇదే మొదటిసారి. జయనగర్-కుర్థా రైలు మార్గం ఇప్పటికే అందుబాటులో ఉండగా, రక్సాల్ నుండి ఖాట్మండు వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి చర్చలు జరుగుతున్నాయి.

Read Also: India US tariff: గుడ్ న్యూస్.. భారత్ పై టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్

Nepal-India: ప్రారంభమైన ఇరు దేశాల మధ్య డైరెక్ట్ బస్సు

న్యూఢిల్లీలోని సరోజినీ నగర్ నుండి ప్రతిరోజూ సాయంత్రం 4:00 గంటలకు బస్సు

ప్రతిరోజూ ఉదయం 6:45 గంటలకు బేనీ నుండి బస్సు బయలుదేరుతుంది. న్యూఢిల్లీలోని సరోజినీ నగర్ నుండి ప్రతిరోజూ సాయంత్రం 4:00 గంటలకు బస్సు బయలుదేరుతుంది. ఢిల్లీ నుండి బేనీకి ఇండియన్ కరెన్సీ అయితే రూ.3,200 టికెట్ ధర. అదే బేనీ నుండి ఢిల్లీకి నేపాల్ కరెన్సీలో రూ.5,400. ఈ బస్సు అగ్రా, అయోధ్య, భైరవా, వాలింగ్, స్యాంగ్జా మీదుగా ప్రయాణిస్తుంది. బేనీకి చేరుకున్న తర్వాత, భక్తులు అక్కడి నుండి ట్యాక్సీ, జీపు లేదా స్థానిక బస్సుల ద్వారా కేవలం 3 నుండి 4 గంటల్లో ముక్తినాథ్ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ప్రయాణానికి పాస్‌పోర్ట్ అవసరం లేదు. ఓటర్ ఐడీ లేదా ప్రభుత్వం గుర్తించిన ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. ఈ బస్సు సర్వీసును మోడరన్ ఎరా టూర్స్ అండ్ ట్రావెల్స్, సృష్టి యాతాయత్ ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్‌గా నిర్వహిస్తున్నాయి. సముద్ర మట్టానికి 3,710 మీటర్ల ఎత్తులో ఉండే ముక్తినాథ్ క్షేత్రానికి ఏటా లక్షలాది మంది భారతీయ భక్తులు వస్తుంటారు. ఈ నేరుగా బస్సు సర్వీసు వల్ల ప్రయాణ ఖర్చులు, సమయం గణనీయంగా తగ్గుతాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

bus service between countries cross-border transport direct bus service inter-country bus service international bus route new transport services Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.