📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Diogo Jota: రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఫుట్‌బాల్ ప్లేయర్

Author Icon By Anusha
Updated: July 3, 2025 • 5:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ ఫుట్‌బాల్‌ ప్రేక్షకులను విషాదంలో ముంచేసే ఘటన బుధవారం చోటు చేసుకుంది. పోర్చుగల్‌కు చెందిన ప్రఖ్యాత ఫుట్‌బాల్ స్టార్, లివర్‌పూల్ క్లబ్ ఆటగాడు డియోగో జోటా (28) ఘోర కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన స్పెయిన్‌లోని జమెరా నగరంలో అర్థరాత్రి 12:40 గంటలకు చోటు చేసుకున్నట్టు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.కారు అదుపు తప్పడంతో మంటలు చెలరేగాయని, ప్రమాద ధాటికి అందులో ఉన్న డియోగోతో పాటు అతని సోదరుడు ఆండ్రీ సిల్వా (Andre Silva) అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది. కారు టైర్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.డియోగో జోటా 10 రోజుల క్రితమే తన చిన్ననాటి స్నేహితురాలు రూట్ కార్డోసోను పెళ్లి చేసుకున్నాడు.

జోటాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు

ఇంతలోనే అతను ప్రాణాలు కోల్పోవడం విషాదంగా మారింది. పెళ్లికి ముందే తన ప్రేయసితో సహజీవనం చేసిన జోటాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.డియో (Diogo Jota) గో మరణాన్ని పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ధృవీకరించింది. కారు ప్రమాదంతో డియోగో జోటాతో పాటు అతని సోదరుడు ఆండ్రీ సిల్వా కూడా మరణించారని పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు పెడ్రో ప్రోయెంకా (Pedro Proenca) తెలిపారు. డియోగో సోదరుడు ఆండ్రీ సిల్వా కూడా ప్రొఫెషనల్ ఆటగాడే కావడం గమనార్హం. అతను పోర్చుగీస్ 2వ లీగ్‌లో పెనాపీల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

తరఫున కూడా జోటా రాణించాడు

పోర్డోలో జన్మించిన డియోగో జోటా 2016లో అట్లెటిక్ మాడ్రిక్ క్లబ్‌తో తన ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించాడు. ప్రీమియర్ లీగ్‌లో వోల్వర్‌హాంప్టన్ వాండరర్స్ తరఫున ఆడిన జోటా ఆ తర్వాత లివర్‌పూల్ జట్టు తరఫున బరిలోకి దిగాడు. ఎఫ్‌ఏ కప్, లీగ్ కప్ టైటిల్స్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. పోర్చుగల్ జట్టు (Portugal team) తరఫున కూడా జోటా రాణించాడు.డియోగో జోటా జీవితం యువతకు ఒక స్ఫూర్తి. కష్టం, పట్టుదలతో ప్రపంచ ఫుట్‌బాల్ స్టేజ్‌కి చేరుకున్న అతని జీవితం అర్దాంతరంగా అంతమయ్యింది. ఈ ఘటన కారు ప్రమాదాలపై మరింత అవగాహన అవసరమని, వేగం పరిమితిలో ఉండటం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది.

Read Hindi: hindi.vaartha.com

Read Also: SL vs BAN: మ్యాచ్‌ మధ్యలో గ్రౌండ్ లోకి పాము

Andre Silva accident car fire incident Spain Diogo Jota brother death Diogo Jota car crash Diogo Jota death Diogo Jota news Diogo Jota Spain accident fire in car crash football player fatal crash football star dies in Spain football world mourns Jota accident details late night car crash Liverpool forward dies Liverpool player accident Portugal football tragedy Portuguese footballer dies Telugu News tragic car accident tyre burst accident Zamora car accident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.