📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Dilip Vengsarkar: టీమిండియా జట్టులో ఈ రెండు మార్పులు చేస్తే విజయం ఖాయం

Author Icon By Anusha
Updated: July 18, 2025 • 1:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంగ్లండ్‌తో జరుగనున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాలంటే జట్టులో రెండు కీలక మార్పులు తప్పనిసరి అని భారత మాజీ క్రికెటర్, 1983 వరల్డ్ కప్ విజేత దిలీప్ వెంగ్‌సర్కార్ (Dilip Vengsarkar) పేర్కొన్నారు. ప్రస్తుతం ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. నాలుగో టెస్ట్ జులై 23 నుంచి మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్‌లో ప్రారంభం కానుంది. భారత్ విజయాన్ని సాధించి సిరీస్‌ను సమం చేయాలంటే జట్టులో స్పెషలిస్ట్ బౌలర్లకు స్థానం కల్పించాల్సిన అవసరం ఉందని వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డారు.వెంగ్‌సర్కార్ సూచనల ప్రకారం, ఆల్‌రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌ (Washington Sundar) లను జట్టులో నుంచి తప్పించి, వారి స్థానంలో స్పెషలిస్ట్ బౌలర్లైన కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్‌లను తీసుకోవాలి. “పార్ట్‌టైమ్ బౌలర్లతో విజయం సాధించలేం, టెస్ట్ మ్యాచ్‌లలో ఐదుగురు నిపుణులైన బౌలర్లు అవసరం” అని ఆయన స్పష్టం చేశారు.

నితీష్ కుమార్ రెడ్డిని తుది జట్టు నుంచి తప్పిస్తాను

అర్ష్‌దీప్ సింగ్ ఎడమచేతి వాటం పేసర్‌గా ఇంగ్లీష్ పిచ్‌లపై బంతిని స్వింగ్ చేయగల సామర్థ్యం ఉన్నాడని, అతని చొరవతో జట్టుకు మరింత బలం చేకూరుతుందని, వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డారు.అర్ష్‌దీప్ మంచి లెఫ్టార్మ్ బౌలర్. అతను బంతితో ఆఫ్ ద వికెట్ నుంచి అద్భుతంగా స్వింగ్ రాబట్టగలడు. ఇంగ్లీష్ కండిషన్స్‌లో ఇది చాలా కీలకం. అతను బంతిని రివర్స్ స్వింగ్ కూడా చేయగలడు. ఇది కూడా చాలా ముఖ్యం. అతని బౌలింగ్‌ను నేను నిశితంగా పరిశీలించాను. అర్ష్‌దీప్ సింగ్ కోసం నేను నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) ని తుది జట్టు నుంచి తప్పిస్తాను. సిరాజ్, బుమ్రా నాలుగో టెస్ట్‌ ఆడాలి. వాషింగ్టన్ సుందర్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలి. టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లు కావాలి. ఆరుగురు బ్యాటర్లు కావాల్సిన పరుగులు చేయకపోతే,బౌలింగ్‌ విభాగం బాధ్యత తీసుకోవాలి. అంతేగానీ పార్ట్ టైమ్ బౌలర్లతో టెస్ట్ మ్యాచ్‌ను గెలవలేరు.’అని దిలీప్ వెంగ్‌సర్కార్ చెప్పుకొచ్చాడు.

Dilip Vengsarkar: టీమిండియా జట్టులో ఈ రెండు మార్పులు చేస్తే విజయం ఖాయం

ఫిట్‌గా లేకపోతే సిరీస్‌ నుంచి తప్పుకోండి

వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా జస్‌ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వడాన్ని వెంగ్‌సర్కార్ తప్పుబట్టాడు. ఇదెక్కడి సంస్కృతి అంటూ మండిపడ్డాడు. ‘భారత జట్టు తరఫున ఆడటం ముఖ్యం. ఫిట్‌గా లేకపోతే సిరీస్‌ నుంచి తప్పుకోండి. అతని(బుమ్రా)కి తొలి టెస్ట్ తర్వాత 7-8 రోజుల విశ్రాంతి లభించింది. అయినా రెండో టెస్ట్‌కు దూరంగా ఉంచడం ఆమోదయోగ్యమైన నిర్ణయం కాదు. బహుషా గంభీర్, అగార్కర్‌ (Agarkar) కు ఇలా చేయడం నచ్చుతుందేమో. నాకు మాత్రం ఇలా ఆటగాళ్లు తమకు నచ్చిన మ్యాచ్ ఆడటం అస్సలు నచ్చదు. ఫిట్‌గా ఉంటే జట్టుకు అందుబాటులో ఉండాలి. జట్టు తరఫున అన్ని మ్యాచ్‌లు ఆడాలి. బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలర్. అతను భారత్‌కు విజయాలు అందించగలడు. ఒక్కసారి విదేశీ పర్యటనకు వచ్ఛారంటే,జట్టు తరఫున ప్రతీ మ్యాచ్ ఆడాలి. వ్యక్తిగత ప్రాధాన్యత ఆధారంగా మ్యాచ్‌లను ఎంచుకునే ఆస్కారం ఇవ్వద్దు.’అని దిలీప్ వెంగ్‌సర్కార్ చెప్పుకొచ్చాడు.

దిలీప్ వెంగ్‌సర్కార్ ఎవరు?

దిలీప్ వెంగ్‌సర్కార్ భారత క్రికెట్ జట్టుకు చెందిన ప్రముఖ మాజీ ఆటగాడు. ఆయన 1983 ప్రపంచకప్‌ను గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నారు.

దిలీప్ వెంగ్‌సర్కార్ ఎప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌ నుండి రిటైర్ అయ్యారు?

దిలీప్ వెంగ్‌సర్కార్ 1992లో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Rishabh Pant : 61 ఏళ్ల రికార్డుపై కన్నేసిన రిషబ్ పంత్

4th Test Preview Arshdeep Singh Dileep Vengsarkar Suggestions India vs England Test series 2025 Kuldeep Yadav Nitish Kumar Reddy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.