DGCA New Rules: దేశీయ విమాన ప్రయాణీకులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల్లోని మొత్తం సీట్లలో కనీసం 60 శాతం సీట్లపై ఎటువంటి అదనపు ఛార్జీలు (Pre-booking charges) విధించరాదని విమానయాన సంస్థలను ఆదేశించింది. అయితే, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశీయ విమానయాన సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిబంధన వల్ల తమ ఆదాయ మార్గాలకు గండి పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Read Also: Microsoft Windows Updates: విండోస్ 11 అప్‌డేట్‌తో తిప్పలు.. వినియోగదారులకు లాగిన్ కష్టాలు

DGCA New Rules: టికెట్ల ధరలు పెరిగే అవకాశం ఉందన్న FIA
ఇండిగో, ఎయిరిండియా, స్పైస్‌జెట్ వంటి ప్రముఖ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ (FIA) ఈ మేరకు కేంద్రానికి విన్నవించింది. 60 శాతం సీట్లపై అదనపు వసూళ్లు నిలిపివేస్తే, ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి విమాన టికెట్ల ప్రాథమిక ధరలను పెంచక తప్పదని FIA పేర్కొంది. ఇది అంతిమంగా ప్రయాణీకులపైనే భారం మోపుతుందని వారు వాదిస్తున్నారు.
వ్యాపార నిర్ణయాల్లో జోక్యం వద్దు
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వంటి నియంత్రణ సంస్థలు విమానయాన సంస్థల అంతర్గత వ్యాపార నిర్ణయాలలో జోక్యం చేసుకోరాదని FIA స్పష్టం చేసింది. అన్‌బండిల్డ్ సేవలు (సీటు సెలక్షన్, భోజనం వంటి అదనపు సేవలు) మరియు వాటి ఛార్జీలను నిర్ణయించే పూర్తి అధికారం సదరు సంస్థలకే ఉండాలని డిమాండ్ చేసింది. ఈ ఆదేశాలను వెంటనే పునఃపరిశీలించాలని వారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: