DGCA : పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయగా, పాక్ కూడా ప్రతిచర్యకు దిగింది. భారత విమానాలు తమ గగనతలంలోకి రాకుండా నిషేధం విధించింది. దీనివల్ల విమాన ప్రయాణాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని డీజీసీఏ విమానయాన సంస్థలకు సూచించింది. ఈ మేరకు డీజీసీఏ విమానయాన సంస్థలకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేసింది. ప్రయానికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆదేశించింది.
అందుకు ప్రతీగా పాక్ కూడా చర్యలు
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రస్తుతం భారత్-పాకిస్థాన్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించే దశలో ఉన్నాయి. ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తే.. అందుకు ప్రతీగా పాక్ కూడా చర్యలు ప్రారంభించింది. భారత్ నుంచి వచ్చే విమానాలను తమ గగనతలంలోకి రాకుండా నిషేధిస్తూ ఆంక్షలు జారీ చేసింది. పాక్ నిర్ణయం నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ విమానయాన సంస్థలకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..
కచ్చితమైన సమాచారాన్ని ప్రయాణికులకు అందించాలి
పాక్ గగనతలం మూసివేత కారణంగా భారత్ ఎయిర్‌లైన్ కార్యకలాపాలు ప్రభావితమయ్యాయని డీజీసీఏ పేర్కొంది. దాయాది దేశం తీసుకున్న నిర్ణయం కారణంగా.. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు సంబంధించి ప్రయాణ సమయం మరింత పెరగనున్నట్లు డీజీసీఏ తెలిపింది. ఈనేపథ్యంలో విమానయాన సంస్థలకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ప్రయాణికులకు అందించాలని డీజీసీఏసూచించింది.
Read Also: కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..28 మంది మావోయిస్టులు మృతి !