📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Denmark: డెన్మార్క్ లో పిల్లలు సోషల్ మీడియా వాడటం నిషేధం

Author Icon By Aanusha
Updated: November 9, 2025 • 7:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్మార్ట్‌ఫోన్‌లు మానవ జీవితంలో భాగంగా మారిపోయాయి. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉండటం ఇప్పుడు సాధారణమైపోయింది. కాల్‌లు, మెసేజింగ్ మాత్రమే కాదు.. ఇప్పుడు వినోదం, షాపింగ్, బ్యాంకింగ్ ఇలా ప్రతీ పని కూడా మొబైల్ ఫోన్ ద్వారానే జరుగుతోంది. ముఖ్యంగా యూట్యూబ్ (YouTube), ఇన్‌స్టాగ్రామ్ (Instagram), వాట్సాప్ (WhatsApp), ఎక్స్ (X) లాంటి సోషల్ మీడియా యాప్స్‌ ఇప్పుడు అందరి జీవితంలో విడదీయరాని భాగమైపోయాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు వీటిలో సమయం గడుపుతున్నారు.

Read Also: Japan:ఎలుగుబంట్ల ఉధృతి ప్రజల భద్రత కోసం ప్రభుత్వ రంగ ప్రవేశం

సోషల్ మీడియా వినియోగంపై డెన్మార్క్ కఠిన చర్య

అయితే ఈ సోషల్ మీడియా వినియోగం వల్ల చిన్నారుల మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. చిన్న వయసులోనే పిల్లలు వర్చువల్ ప్రపంచంలో మునిగిపోతుండటంతో విద్య, ప్రవర్తన, సామాజిక విలువలు దెబ్బతింటున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ సభ్యదేశం డెన్మార్క్ (Denmark) పెద్ద నిర్ణయం తీసుకుంది.డెన్మార్క్ ప్రభుత్వం (Denmark)15 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఓ చట్టాన్ని తీసుకురానుంది.

Denmark

ప్రమాదకర కంటెంట్‌కు పిల్లల్ని దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో

ప్రస్తుతం సోషల్ మీడియాలో హింస, లైంగిక వేధింపులు, స్వీయ హాని లాంటి ప్రమాదకర కంటెంట్‌కు పిల్లల్ని దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డెన్మార్క్‌ డిజిటల్ అఫైర్స్‌ మంత్రి కరోలినా వెల్లడించారు. ఇదిలాఉండగా ఫ్రాన్స్‌ ప్రభుత్వం కూడా 15 ఏళ్లు లోపు పిల్లలకు సోషల్‌ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల పర్మిషన్‌ను తప్పనిసరి చేస్తూ చట్టాన్ని ఆమోదించింది.

అలాగే ఆస్ట్రేలియా (Australia) కూడా 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే చట్టాన్ని తీసుకొచ్చింది. మరోవైపు భారత్‌ సహా మరికొన్ని దేశాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కనీస వయస్సును 13 ఏళ్లుగా నిర్ణయించాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Denmark EU Regulation Kids Safety Online latest news Social Media Ban Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.