📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Delhi Blast: మారణహోమానికి ప్లాన్ వేసిన ఉగ్రవాది డానిష్

Author Icon By Sushmitha
Updated: December 2, 2025 • 2:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కీలక సమాచారం సేకరించిన పోలీసులు వీడియోలు, ఫొటోలు లభ్యం ఢిల్లీ కారుబాంబు పేలుడుపై జరుగుతున్న దర్యాప్తులో కీలక విషయాలు వెలువడుతున్నాయి. దర్యాప్తు సంస్థలు వేగంగా తమ దర్యాప్తును కొనసాగిస్తున్నాయి. ఒకవిధంగా భారతదేశానికి భారీ పెనుముప్పు తప్పింది. దేశాన్ని అల్లకల్లోలాన్ని సృష్టించి, ఆర్థికంగా చిన్నాభిన్నం చేసేందుకు భారీ కుట్రపడ్డాయి ఉగ్రసంస్థలు.

Read Also: Pakistan: పాక్ రిలీజ్ చేసిన మహిళా ఆత్మాహుతి బాంబర్ ఫోటో

ఢిల్లీ కారు బ్లాస్ట్ పై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే అనేక కీలక విషయాలను దర్యాప్తు సంస్థలు రాబట్టాయి. ఇక ఢిల్లీ బ్లాస్ట్ (Delhi Blast) వెనుక ఉన్న సహ కుట్రదారుడు జాసిర్ బిలాల్ వనీ అలియాస్ డానిష్ ను నవంబరు 17న పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ పేలుళ్ల వెనుక క్రియాశీల సహ-కుట్రదారుడిగా ఇతడేనని కనిపెట్టారు. అంతే కాకుండా దేశవ్యాప్త పేలుళ్లకు కీలక సూత్రదారుడిగా భావిస్తున్నారు.

Delhi Blast Danish, the terrorist who planned the massacre

డ్రోన్ దాడులకు కుట్ర

డానిష్ డ్రోన్లు నిర్వహించడంలో స్పెషలిస్ట్. ఇజ్రాయెల్ (Israel) పై హమాస్ జరిపించినట్లుగా అదే తరహాలో డ్రోన్ దాడులు చేయాలని కుట్రపడినట్లు తేలింది. ఈ మేరకు డానిష్ లో లభ్యమైన ఫొటోలను బట్టి అధికారులు అంచనాకు వచ్చారు. డానిష్ ఫోన్ లో డిలీట్ అయిన ఫోల్డర్ నుంచి ఫొటోలు, వీడియోలను అధికారుల బృందం సేకరించింది. ఇందులో డ్రోన్లు, రాకెట్ లాంచర్లు డజన్లకొద్ది చిత్రాలు, వీడియోలను గుర్తించారు. హమాస్ తరహాలోనే భారత్ లోనూ దాడులు చేయాలని ప్లాన్ చేసినట్లుగా కనిపెట్టారు. డ్రోన్లలో పేలుడు పదార్థాలు ఎలా అమర్చాలో కూడా ఒక వీడియో మొబైల్ లో ఉంది. వీడియోలన్నీ ఒక యాప్ ద్వారా సహచర కుట్రదారులకు పంపినట్లుగా కనుగొన్నారు. యాప్ లో కొన్ని విదేశీ నెంబర్లు కూడా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇక ఉగ్రవాదులు 25కిలోమీటర్ల వరకు ప్రయాణించగల మోడిఫైడ్ డ్రోన్ లను కూడా తయారు చేసినట్లుగా దర్యాప్తులో తేలింది.

తక్కువ ఖర్చుతోనే తయారు చేయొచ్చు

హమాస్ ఉపయోగించిన గ్లైడింగ్ రాకెట్లపై కూడా ఉగ్రవాదులు పరిశోధనలు చేసినట్లుగా తెలుస్తోంది. డ్రోన్, యాంటీ డ్రోన్ తయారీ సంస్థ ఇండోవింగ్స్ సీఈవో పరాస్ జైన్ మాట్లాడుతూ.. ఈ రాకెట్లు భూమి నుంచి లేదా చేతితో కూడా విడుదల చేయొచ్చని తెలిపారు. ఇవి తక్కువ ఖర్చుతోనే తయారు చేయవచ్చని చెప్పారు. ఈ రాకెట్ ను 20 సెకన్లలో ప్రయోగించవచ్చని ఒక నిమిషంలో 3 రాకెట్లు వరకు ప్రయోగించొచ్చని పేర్కొన్నారు హమాస్ పెద్ద మొత్తంలో ఇలాంటి రాకెట్లనే ప్రయోగించిందని వేగంగా విధ్వంసాన్ని సృష్టిస్తాయని వెల్లడించారు.

డ్రోన్ (Drone) నిపుణుడు డానిష్ డ్రోన్లు, రాకెట్లను తయారు చేయడంలో డానిష్ నిపుణుడు. అంతేకాదు వీటిపై మంచి పట్టుఉంది. కెమెరాలతో పాటు బరువైన బాంబులను మోసుకెళ్లగల పెద్ద బ్యాటరీలతో అమర్చబడిన శక్తివంతమైన డ్రోన్ లను తయారు చేయగల సామర్థ్యం ఉన్నట్లు వర్గాలు పేర్కొన్నాయి. చిన్న, ఆయుధరహిత డ్రోన్ లను తయారు చేయడంలో మంచి అనుభవం ఉందని తెలిపారు. శ్రీనగర్ లో గతనెల 17న డానిష్ ను అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ ఉమర్ తో కలిసి డానిష్ మారణహోమాన్ని సృష్టించాలని ప్లాన్ వేసినట్లుగా అధికారులు కనిపెట్టారు. అల్-ఫలాహ్ యూనివర్సిటీకి డానిష్ పలుమూళ్లు వచ్చి మాస్టర్ ప్లాన్ వివరించినట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సేకరించినట్లు తెలుస్తోంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

CounterTerrorism Danish DelhiBlast drone Google News in Telugu IndiaSecurity Latest News in Telugu MajorConspiracy MilitantArrest Telugu News Today TerroristAttack TerrorPlot

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.