📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan : కడుపుమంటను బయటపెట్టుకున్నా రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్

Author Icon By Vanipushpa
Updated: May 2, 2025 • 4:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గామ్‌లో ఉగ్రవాదుల ఘాతుకం తరువాత పాకిస్తాన్ మరింత రెచ్చిపోతోంది. భారత్‌పై బురదజల్లే ప్రయత్నాలకు తెర తీసింది. ఎదురుదాడికి దిగుతోంది. అంతర్జాతీయ వేదికలపైనా భారత్‌ను బద్నాం చేయడానికి శతవిధాలా శ్రమిస్తోంది గానీ అవేవీ ఫలించట్లేదు. దీనితో పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరింత బరితెగించారు. తన కడుపుమంటను బయటపెట్టుకున్నారు. భారతే స్వయంగా ఉగ్రవాదాన్ని పోషిస్తోందంటూ బట్ట కాల్చి ముఖం వేశారు. ఒకదశలో చొరబాట్లనూ సమర్థించుకున్నారాయన. సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

భారత్ ఇలాంటి ప్రకటనలు చేయడం సరికాదు
తమ బలగాలను బలోపేతం చేశామని, కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోదలచుకున్నామని ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. తమపై భారత్ దాడికి పాల్పడే అవకాశం ఉన్నందున ఆ దేశాన్ని అన్ని రకాలుగా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చొరబాటు ఆసన్నమైందని తాను ఎందుకు భావిస్తున్నానో మరిన్ని వివరాలలోకి వెళ్లలేదని ఆయన అన్నారు. పహల్గామ్‌లో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఇద్దరు పాకిస్తాన్‌కు చెందినవారని భారత్ చెప్పడాన్ని ఖవాజా తప్పు పట్టారు ఎటువంటి ఆధారాలు లేకుండా భారత్ ఇలాంటి ప్రకటనలను చేయడం సరికాదని అన్నారు. దీన్ని తమ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారని, తటస్థ దర్యాప్తుకు పిలుపునిచ్చిన విషయాన్ని ఆసిఫ్ గుర్తు చేశారు. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సీనియర్ నాయకుడు, విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో కూడా ఇదేరకంగా మాట్లాడారు. స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు కూడా.

Read Also : Himanshi Narwal: ముస్లింలపై పహల్గామ్ దాడిలో మరణించిన నేవీ ఆఫీసర్ భార్య కీలక సూచనలు

Breaking News in Telugu Defense Minister Google news Google News in Telugu his inner turmoil Khawaja Asif reveals Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.