📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: India-Russia: రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

Author Icon By Vanipushpa
Updated: December 6, 2025 • 5:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) డిసెంబర్ 4, 5 తేదీల్లో భారత్‌ పర్యటించిన సంగతి తెలిసిందే. 23వ భారత్‌-రష్యా(india-russia) వార్షిక శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ(PM Modi) తో ఆయన సమావేశమయ్యారు. ఈ రెండు రోజుల పర్యటనలో ఇరుదేశాల మధ్య వ్యహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు రక్షణ, వాణిజ్యం, ఇంధనం, సాంకేతికతతో సహా కీలక రంగాలలో పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. పుతిన్ పర్యటనలో భాగంగా ‘రికార్సిప్రొకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్’ (RELOS) ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ఇరు దేశాల సైనిక బలగాలు, నౌకలు, విమానాలు లాజిస్టిక్ మద్దతు కోసం ఈ సౌకర్యాలను ఒకరినొకరు వినియోగించుకోవచ్చు.

Read Also: Amazon River: అమెజాన్ నదిపై వంతెనలు ఎందుకు లేవో తెలుసా?

India-Russia

S-400 స్క్వాడ్రన్లు కొనుగోలు చేసేందుకు ఒప్పందం

S-400 స్క్వాడ్రన్ల అదనపు డెలివరీలు, అత్యాధునికి SU-57 స్టెల్త్‌ ఫైటర్ జెట్‌లు, అలాగే S-500 అడ్వాన్స్‌డ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ షీల్ట్‌ వ్యవస్థల కొనుగోలుపై చర్చలు జరిపారు. మరో అయిదు S-400 స్క్వాడ్రన్లు కొనుగోలు చేసేందుకు ఒప్పందం జరిగనట్లు తెలుస్తోంది. అలాగే మేక్ ఇన్ ఇండియా చొరవ కింద ఏకే-203 రైఫిళ్లు, బ్రహ్మోస్ క్షిపణులు, రష్యా నుంచి సరఫరా అయ్యే రక్షణ పరికరాల విడిభాగాలు, ఇతర ఉత్పత్తులను ఉమ్మడి తయారీని ప్రోత్సహించడం కోసం ఇరుపక్షాలు అంగీకారం తెలిపాయి. 2024-25 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $68.7 బిలియన్లకు చేరగా.. 2030 నాటికి $100 బిలియన్లకు పెంచాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి.

అమెరికా నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ..

ఇంధన భద్రత, పౌర అణు సహకారం భారత్‌-రష్యా భాగస్వామ్యంలో కీలక స్థాలను కలిగి ఉన్నాయి. అమెరికా నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ.. తక్కువ ధరకే ముడి చమురును నిరంతరాయంగా సరఫరా చేసేందుకు కట్టుబడి ఉంటామని పుతిన్ ప్రకటించారు. అలాగే కుడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి (KKNPP) సంబంధించి, చిన్న రియాక్టర్ల తయారీపై చర్చలు జరిగాయి. అణుశక్తి రంగంలో ఇరుదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు ఒప్పందాలు కుదిరాయి. అలాగే ఇరు దేశాల పౌరులు తాత్కాలికంగా పని చేసేందుకు వీలు కల్పించే తాత్కాలిక కార్మిక కార్యకలాపాల ఒప్పందంపై కూడా సంతకాలు జరిగాయి.ఇక రష్యా పౌరులకు 30 రోజుల ఉచిత ఇ-టూరిస్ట్ వీసాను అందిస్తామని ప్రధాని మోదీ అన్నారు. అలాగే అంతర్జాతీయ బిగ్ క్యాట్‌ అలయన్స్‌లో చేరేందుకు రష్యా అంగీకరించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Bilateral relations Breaking News in Telugu Defence Agreements Economic Cooperation Energy Cooperation Google News in Telugu international agreements Latest In telugu news Strategic Partnerships Telugu News Today Trade Deals

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.