Defence Deal: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ భారత పర్యటన సందర్భంగా, భారత్–ఫ్రాన్స్ రక్షణ సహకారం మరింత బలపడుతోంది. హామర్ క్షిపణులను (Highly Agile Modular Munition Extended Range) కలిసి అభివృద్ధి చేసుకునేందుకు రెండు దేశాలు ఒప్పందానికి సిద్ధమయ్యాయి. ఇప్పటివరకు ఈ క్షిపణులను భారత్ ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటుండగా, కొత్త ఒప్పందంతో దేశీయంగా తయారీకి మార్గం సుగమం కానుంది.
Read Also: Iran: హార్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్.. సైనిక విన్యాసాల కోసమేనా?
హామర్ క్షిపణుల ప్రత్యేకతలు
హామర్ క్షిపణులు గాలి నుంచి భూమిపై లక్ష్యాలను ధ్వంసం చేసే మధ్య శ్రేణి ఆయుధాలు. ఇవి బంకర్లు, పర్వత ప్రాంతాల్లోని లక్ష్యాలను కూడా నాశనం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. 60–70 కిలోమీటర్ల పరిధిలో అత్యంత ఖచ్చితంగా దాడి చేయగల ఈ క్షిపణులు GPS, ఇన్ఫ్రారెడ్, లేజర్ గైడెన్స్‌తో పనిచేస్తాయి. తక్కువ ఎత్తులో ప్రయాణించే విమానాల నుంచి కూడా ప్రయోగించవచ్చు. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా పనిచేసే విధంగా వీటి రూపకల్పన జరిగింది.
భారత్‌లో తయారీ, తేజస్‌కు అమరిక
ఈ ఒప్పందం కింద ఫ్రాన్స్‌కు చెందిన సఫ్రాన్ సంస్థ, భారత్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) కలిసి హామర్ క్షిపణులను అభివృద్ధి చేయనున్నాయి. అలాగే స్వదేశీ తేజస్ యుద్ధ విమానాల్లో కూడా వీటిని అమర్చాలని రక్షణ శాఖ నిర్ణయించింది. దీని ద్వారా భారత్ రక్షణ సామర్థ్యం మరింత పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.
రాఫేల్ లోకలైజేషన్, కొత్త ఒప్పందాలు
రాఫేల్ యుద్ధ విమానాల్లో 50 శాతం వరకు దేశీయ పరికరాలు ఉండేలా చూడాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫ్రాన్స్‌ను కోరారు. అంతేకాదు, 114 రాఫేల్ విమానాల సరఫరా కోసం భారీ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: