📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: War: దేశాలమధ్య కొరవడుతున్న స్నేహం ..మూడో ప్రపంచ యుద్ధం వైపు అడుగులు!

Author Icon By Vanipushpa
Updated: October 14, 2025 • 12:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశాలమధ్య కొరవడుతున్న స్నేహం ..మూడో ప్రపంచ యుద్ధం వైపు అడుగులు!
గత కొన్నేళ్ళుగా ఎక్కడో ఒక చోట యుద్ధం జరుగుతూనే ఉంది. రెండేళ్ళుగా అవుతున్న ఇజ్రాయెల్, హమాస్ యుద్దానికి తెర పడింది. కానీ మరో వైపు పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ (Pakistan Afghanistan) మధ్య అగ్గి రాజుకుంది. అలాగే మూడేళ్ళుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయన్ యుద్ధం కూడా పీక్ చేరుకుంటోంది. ఇప్పటి వరకు యుద్ధాలను ఆపుతాను, ప్రపంచ శాంతే ముఖ్యమని అంటున్న అన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఉక్రెయిన్ నె ఎగదోస్తున్నారు. దీంతో ప్రపంచంలో అసలేం జరుగుతోంది. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా అనే సందేహాలు వెలువడుతున్నాయి.

Read Also: Bilateral Trade Agreement: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తుది దశలో

War: దేశాలమధ్య కొరవడుతున్న స్నేహం ..మూడో ప్రపంచ యుద్ధం వైపు అడుగులు!

కయ్యానికి కాలు దువ్వుతున్న పాక్..

భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏప్రిల్ లో పహల్గాందాడి తరువాత ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చి వార్ కు తెర దించాయి. కానీ ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతోంది. మరోవైపు అప్ఘనిస్తాన్ ను కూడా రెచ్చగొడుతోంది. ఆ దేశ విదేశాంగ మంత్రి భారత్ కు వచ్చినప్పుడే పథకం ప్రకారం పాకిస్తాన్ దాడి చేసింది. రెండు రోజుల పాటూ ఇరు దేశాల మధ్యనా భీకర యుద్ధం జరిగింది. 200 మంది తాలిబన్లను పాక్ ఆర్మీ చంపేసింది. దీనికి ప్రతీకారంగా ఆఫ్ఘాన్ సైన్యం..పాక్ ఆర్మీని బోర్డర్ నుంచి తరిమి తరమి కొట్టింది 58 మంది సైనికుల్ని మట్టుబెట్టింది. అయితే ప్రస్తుతానికి వార్ ను ఆపేశామని ఆఫ్గాన్ అనౌన్స్ చేసింది. సౌదీ అరేబియా, ఖతార్‌ తదితర గల్ఫ్‌ దేశాల అభ్యర్థన మేరకు దాడుల్ని నిలిపివేశామని అఫ్గానిస్థాన్‌ విదేశాంగ మంత్రి అమీర్‌ ఖాన్‌ ముత్తాఖీ చెప్పారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ఎప్పుడు

ఇక మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం..గత మూడేళ్ళుగా ఇది సాగుతూనే ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎవరెంత చెప్పినా వినడం లేదు. వేలు, లక్షల మంది ప్రాణాలు పోతున్నా లెక్క చేయడం లేదు. ఉక్రెయిన్ ను రష్యాలో కలిపేంత వరకూ వార్ ను ఆపేది లేదని అంటున్నారు. అలాగే ఉక్రెయిన్ కూడా ఎంతకీ లొంగడం లేదు. రెందు దేశాల మధ్యా సయోధ్య కుదర్చడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇరు దేశాధ్యక్షులోనూ చర్చలు చేశారు. రష్యా మీద ఒత్తిడి తేవడానికి భారత్, చైనాలపై అదనపు సుంకాలతో దాడి చేశారు. కానీ ఏం చేసినా ఫలితం లేకపోయింది. రష్యా మాతరం తన దాడులను ఆపడం లేదు. చివరకు యుద్ధాలను ఆపుతాను, ప్రపంచ శాంతే తనకు ముఖ్యం అని చెబుతున్న ట్రంప్ విసిగి పోయి రష్యాకు వార్నింగ్ ఇచ్చారు. ర

ట్రంప్ తో అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ

ఇవన్నీ ఇలా ఉంటే అమెరికాకు..ఇండియా నెమ్మదిగా దూరమౌతోంది. ఇరు దేశాధ్యాక్షులూ ఒకరిని ఒకరు పొగుడుకుంటున్నారు. మంచి మిత్రులమని చెప్పకుంటున్నారు. కానీ ఇంతకు ముందు ఉన్న దౌత్య సంబంధాలను కొనసాగించడం లేదు. భారత్ తమకు అత్యంత ముఖ్యమైన మిత్ర దేశమని ట్రంప్ చెబుతూనే…వెనుక నుంచి వెన్నుపోటు పొడుస్తున్నారు. దేశానికి, భారతీయులకు నష్టం వచ్చే పనులన్నీ చేస్తున్నారు. భారత ప్రధాని మోదీ కూడా ట్రంప్ తో అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. తమ మధ్య అంతా బాగానే ఉందని చెబుతున్నారు కానీ ఇజ్రాయెల్ జరిగిన పీస్ మీట్ కు మాత్రం వెళ్ళలేదు. ట్రంప్ పిలిచినా మోదీ పట్టించుకోలేదు. ఇవన్నీ చూస్తుంటే…ప్రపంచ దేశాలన్నీ నెమ్మదిగా మూడో వరల్డ్ వార్ దిశగా కదులుతున్నాయా అనే అనుమానం రాకమానడం లేదు.

పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం ఎందుకు జరుగుతోంది?
ఒకప్పుడు మిత్రదేశాలుగా ఉన్న దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి, ఇస్లామాబాద్ కాబూల్ ఆఫ్ఘన్ తాలిబన్లతో దగ్గరి సంబంధం ఉన్న ప్రత్యేక సంస్థ అయిన తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసిన తర్వాత.
పాకిస్తాన్ భారతదేశంతో యుద్ధం ఎందుకు ప్రారంభించింది?
1947 బ్రిటిష్ ఇండియా విభజన నుండి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య వివాదం తలెత్తింది. విభజన ముస్లిం-మెజారిటీ పాకిస్తాన్ మరియు హిందూ-మెజారిటీ భారతదేశాన్ని స్థాపించింది మరియు జమ్మూ మరియు కాశ్మీర్‌లోని విభిన్న ప్రాంతాలు ఏ దేశంలో చేరాలో ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది.

Diplomatic Breakdown Geopolitical Crisis Global Conflict Global Tensions International Relations Telugu News war threats World War 3

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.