📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Dalai Lama : వారసుడి ఎంపిక ప్రక్రియ దలైలామా చేతుల్లోనే ఉంది : భారత్‌

Author Icon By Sudha
Updated: July 3, 2025 • 2:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చైనా ప్రభుత్వం తాజాగా 15వ దలైలామా ఎంపికపై కీలక వ్యాఖ్యలు చేస్తూ, ఆ ప్రక్రియలో తమకు కూడా పాత్ర ఉండాలని, దలైలామా (Dalai Lama)వారసుడిని బీజింగ్ ఆమోదించాలన్న డిమాండ్‌ను చేసింది. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేసింది. దలైలామా (Dalai Lama)వారసుడిని నిర్ణయించే అధికారం టిబెటన్‌ ఆధ్యాత్మిక నాయకుడు తప్ప మరెవరికీ లేదని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజుజు (Kiren Rijiju) గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘దలైలామా స్థానం టిబెటన్లకు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులందరికీ అత్యంత ముఖ్యమైనది. తన వారసుడిని నిర్ణయించే హక్కు దలైలామాకే ఉంది’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

వారసుడి ఎంపిక ప్రక్రియ దలైలామా చేతుల్లోనే ఉంది : భారత్‌

బౌద్ధ సంప్రదాయాల ఆధారంగానే ..
కొత్త దలైలామాను ఎన్నుకుంటామని చేసిన చైనా చేసిన వ్యాఖ్యలపై 14వ టిబెటన్‌ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా (Dalai Lama) టెన్జిన్‌ గ్యాట్సో అలియాస్‌ లామా థోండుప్‌ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 15వ దలైలామా ఎంపిక 600 సంవత్సరాల పురాతన బౌద్ధ సంప్రదాయాల ఆధారంగానే జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తన ట్రస్ట్‌ గాడెన్‌ ఫోడ్రాంగ్‌ తీసుకుంటుందని.. ఇందులో చైనా పాత్ర ఏం ఉండదని స్పష్టం చేశారు. దలైలామా 90వ పుట్టినరోజు నాలుగు రోజుల ముందు ప్రారంభమైన టిబెటన్‌ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దలైలామా ఈ వ్యాఖ్యలు చేశారు.
జోక్యం చేసుకునే హక్కు లేదు
దలైలామా విడుదల చేసిన ఓ ప్రకటనలో బౌద్ధ సంప్రదాయాల ఆధారంగా తదుపరి దలైలామాను గుర్తించే హక్కు గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్‌కు మాత్రమే ఉందని అన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు మరెవరికీ లేదని స్పష్టం చేశారు. దలైలామా సంస్థను కొనసాగించాలని ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో నివసిస్తున్న టిబెటన్లు, టిబెటన్ బౌద్ధుల నుంచి నాకు వివిధ మార్గాల ద్వారా సందేశాలు వచ్చాయని.. దలైలామా సంస్థను కొనసాగించాలని తాను ధ్రువీకరిస్తున్నానన్నారు. తన తర్వాత దలైలామా సంస్థ కొనసాగుతుందని స్పష్టం చేశారు. గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ టిబెటన్ బౌద్ధ సంప్రదాయాల అధిపతులు, దలైలామాల వంశానికి సమగ్రంగా అనుసంధానించబడిన, ప్రమాణం చేసిన నమ్మకమైన ధర్మ పరిరక్షకులను సంప్రదిస్తుందని చెప్పారు. ఇది సంప్రదాయం.. ప్రకారం శోధన, గుర్తింపు ప్రక్రియను పూర్తి చేస్తుందని తెలిపారు.
దలైలామా తన వారసుడు చైనా వెలుపల జన్మించాలని అన్నారు. బీజింగ్ నుంచి ఎంపిక చేసిన వ్యక్తిని ఎవరినైనా తిరస్కరించాలని ఆయన సూచించారు. దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు జూన్ 30న ధర్మశాల సమీపంలోని మెక్లియోడ్‌గంజ్‌లోని ప్రధాన ఆలయమైన సుగ్లగ్‌ఖాంగ్‌లో ప్రారంభమయ్యాయి. అదే సమయంలో లామా థోండప్‌ను వేర్పాటువాదిగా భావించే చైనా, శతాబ్దాల నాటి ఆచారం ద్వారా బీజింగ్ వారసుడి గుర్తింపును ఆమోదిస్తుందని చెప్పింది. టిబెటన్ సంప్రదాయంలో, ఒక సీనియర్ బౌద్ధ సన్యాసి ఆత్మ అతని మరణం తర్వాత ఒక పిల్లల శరీరంలో పునర్జన్మ పొందుతుందని నమ్ముతారు. దలైలామా వెబ్‌సైట్ ప్రకారం.. జూలై 6, 1935న ప్రస్తుత క్వింఘై ప్రావిన్స్‌లోని ఒక రైతు కుటుంబంలో లామో ధోండప్‌గా జన్మించిన 14వ దలైలామా. రెండేళ్ల వయసులో అలాంటి పునర్జన్మలలో ఒకరని గుర్తించారు.

వారసుడి ఎంపిక ప్రక్రియ దలైలామా చేతుల్లోనే ఉంది : భారత్‌

వారసత్వ ప్రణాళికను తిరస్కరించిన : చైనా
చైనా దలైలామా వారసత్వ ప్రణాళికను తిరస్కరించింది. ఏదైనా భావి వారసుడికి తమ ఆమోదం ఉండాల్సిందేనని చెబుతున్నది. ఇది చైనా పాలక కమ్యూనిస్ట్ పార్టీతో టిబెటన్ బౌద్ధమతానికి దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం కొత్త అధ్యయంగా మారబోతున్నది. దలైలామా వారసుడు మతపరమైన సంప్రదాయాలు, చట్టాలకు అనుగుణంగా దేశీయ గుర్తింపు, బంగారు కలశం ప్రక్రియ, చైనా ప్రభుత్వ ఆమోదం సూత్రాలను అనుసరించాలని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు. 1959లో కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ నేతృత్వంలోని చైనా దళాలు టిబెట్‌ను ఆక్రమించుకున్న తర్వాత.. టిబెటన్ల పెద్ద సమూహంతో కలిసి భారత్‌ను ఆశ్రయించి దలైలామా ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. దలైలామా అప్పటి నుంచి ధర్మశాలను తన నివాసంగా చేసుకున్నారు. ఇది బీజింగ్‌కు మింగుడుపడని అంశంగా మారింది. ఆయన ఉనికి చైనా, భారత్‌ మధ్య వివాదంగా మిగిలిపోయింది. టిబెటన్ స్వయంప్రతిపత్తి కోసం పోరాటం ఆయన వారసుడు సైతం కొనసాగించాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే వారసత్వంలో జోక్యం చేసుకోవడం మానేయాలని, మత స్వేచ్ఛను గౌరవించాలని చైనాను కోరుతూనే ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు.

Read Also:China: దలైలామా వారసుడికి మా ఆమోదం ఉండాలంటున్న చైనా

#ChinaInterference #DalaiLama #DalaiLamaSuccessor #Geopolitics #IndiaChina #IndiaSupportsTibet #ReligiousFreedom #Tibet #TibetanBuddhism Breaking News in Telugu China Dalai Lama controversy China influence on Tibetan Buddhism Dalai Lama India Tibet Dalai Lama reincarnation process Dalai Lama successor decision 2025 Dalai Lama successor news Google news Google News in Telugu India on Dalai Lama successor India rejects China on Dalai Lama Latest News in Telugu Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Tibetan religious freedom Today news Who will be the 15th Dalai Lama

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.