📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

China: దలైలామా వారసత్వంపై భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు

Author Icon By Vanipushpa
Updated: July 14, 2025 • 10:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్ క్లారిటీ – చైనాకు ఎలాంటి హక్కు లేదు
భారత ప్రభుత్వం(Indian Govt) ఇప్పటికే దలైలామా(Dalailama) వారసుడి ఎంపిక విషయంలో చైనాకు ఎలాంటి హక్కులు లేవని స్పష్టం చేసింది. ఇది టిబెట్‌(Tibet) బౌద్ధమత వ్యవస్థలో అంతర్గత అంశంగా మాత్రమే పరిగణించబడుతుందని భారత వైఖరి.
చైనా ఎంబసీ వ్యాఖ్యలు – భారత్‌లోని వ్యక్తులపై ఆరోపణలు
దలైలామా వారసత్వంపై వ్యాఖ్యలతో అభ్యంతరం

చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యు జింగ్‌ మాట్లాడుతూ, భారత్‌లోని కొంతమంది వ్యక్తులు దలైలామా వారసత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. అలాగే, టిబెట్‌ సమస్యలు ఎంతో సున్నితమైనవని, వాటిపై భారత విదేశాంగ నిపుణులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. దలైలామా వ్యాఖ్యలు – వారసుడు భారత్‌లోనే జన్మించవచ్చు.

China: దలైలామా వారసత్వంపై భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు

వారసత్వంపై చైనాకు హక్కులేదని దలైలామా ప్రకటన
ఇటీవల దలైలామా మాట్లాడుతూ, తన తర్వాతి జన్మ భారత్‌లోనే కావచ్చని పేర్కొన్నారు. దలైలామా వారసత్వంపై నిర్ణయం పూర్తిగా తనదేనని స్పష్టం చేశారు.
చైనా డిమాండ్ – తమ ఆమోదం తప్పనిసరి అంటున్న డ్రాగన్
వారసుడి ఎంపికపై పట్టు సాధించే ప్రయత్నం
దలైలామా వారసుడి ఎంపికకు తమ ఆమోదముద్ర తప్పనిసరి అని చైనా వాదిస్తోంది. ఇది చైనా అంతర్గత వ్యవహారమని మరోసారి తేల్చిచెప్పింది. జైశంకర్ చైనా పర్యటన – సమయం గమనార్హం
2020 గల్వాన్ ఘటన తర్వాత భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తొలిసారి చైనా పర్యటనకు సిద్ధమవుతున్నారు. చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యితో కీలక చర్చలు జరగనున్న నేపథ్యంలో, దలైలామా వారసత్వంపై చైనా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యలు
వారసుడి ఎంపికకు దలైలామాకే పూర్తి హక్కు

దలైలామా పుట్టినరోజు వేడుకల సందర్భంగా, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, 15వ దలైలామాను ఎంపిక చేసే హక్కు పూర్తిగా ప్రస్తుత దలైలామాకే ఉంటుందని తెలిపారు. చైనాకు ఆ అధికారం లేదని తేల్చిచెప్పారు. అనంతరం దలైలామా వారసుడి ఎంపికకు కచ్చితంగా తమ ఆమోదముద్ర కావాలంటూ చైనా డిమాండ్‌ చేసింది. ఇటీవల చైనా బయటే తన వారసుడు జన్మిస్తాడని పేర్కొన్నారు దలైలామా. అది కూడా భారత్​లో కావచ్చొని అన్నారు. తన వారసత్వంపై నిర్ణయం తీసుకునే హక్కు చైనాకు లేదని స్పష్టం చేశారు .

దలైలామా భారతదేశంలో జన్మించారా?
పద్నాల్గవ దలైలామా, టెన్జిన్ గ్యాట్సో, టిబెటన్ ప్రజల ఆధ్యాత్మిక మరియు లౌకిక నాయకుడు. ఆయన ఈశాన్య టిబెట్‌లోని తక్ట్సర్ అనే చిన్న గ్రామంలో జన్మించారు.
దలైలామా ఎందుకు అంత ప్రత్యేకమైనవారు?
దలైలామా కార్యాలయం | 14వ దలైలామా
దలైలామా శాంతి కాముకుడు. టిబెట్ విముక్తి కోసం ఆయన చేసిన అహింసా పోరాటానికి 1989లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. తీవ్ర దూకుడు ఉన్నప్పటికీ, ఆయన నిరంతరం అహింసా విధానాలను సమర్థించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also : Alzheimer’s surgery : చైనాలో అల్జీమర్స్ సర్జరీపై నిషేధం

China India Relations Chinese Embassy India Dalai Lama dalai lama successor EAM Jaishankar Kiran Rijiju Tibet Issue

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.