Latest Telugu News : Dalai Lama: గ్రామీ అవార్డుల‌కు నామినేట్ అయిన ద‌లైలామా

Read Time:  1 min
Dalai Lama
Dalai Lama
FONT SIZE
GET APP

నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత ద‌లైలామా(Dalai Lama).. తొట్ట‌తొలి సారి గ్రామీ అవార్డుల‌కు నామినేట్ అయ్యారు. ఆధ్యాత్మిక ప్ర‌వ‌చ‌నాల‌కు చెందిన ద‌లైలామా ఆల్బ‌మ్ ఆ పోటీలో ఉన్న‌ది. ద రిఫ్లెక్స‌న్స్ ఆఫ్ హిజ్ హోలీనెస్ ద ద‌లైలామా (Dalai Lama)అన్న టైటిల్‌తో ఉన్న ఆల్బ‌మ్ గ్రామీల‌కు పోటీప‌డుతున్న‌ది. 90 ఏళ్ల వ‌య‌సులో ద‌లైలామా ఆ అవార్డుకు నామినేట్ కావ‌డం ఓ మైలురాయిగా భావిస్తున్నారు. బెస్ట్ ఆడియో బుక్‌, నారేష‌న్‌, స్టోరీ టెల్లింగ్ రికార్డింగ్ కేట‌గిరీల్లో ద‌లైలామా ప్ర‌వచ‌నాల ఆడియో పోటీప‌డుతున్న‌ది. 2026 ఫిబ్ర‌వ‌రి 1న‌ లాస్ ఏంజిల్స్‌లో 68వ గ్రామీ అవార్డుల‌ ప్ర‌దానోత్స‌వం జ‌ర‌గ‌నున్న‌ది. క‌రుణ‌, ఆత్మ శాంతి, భావోద్వేగాల గురించి ద‌లైలామా చేసిన ప్ర‌సంగాల‌కు.. స‌రోద్ వాయిద్య‌కారుడు అంజ‌ద్ అలీ ఖాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. అంజ‌ద్ కుమారుడు అమ‌న్ అలీ బంగాష్‌, అయ్య‌న్ అలీ బంగాష్ కూడా మ్యూజిక్ కంపోజ్ చేశారు.

Read Also : Puttaparthi: సత్యసాయి నుంచి నేను ఎంతో నేర్చుకున్నా: సచిన్ టెండూల్కర్

 Dalai Lama
Dalai Lama

ద‌లైలామా ఆల్బ‌మ్ కోసం అంత‌ర్జాతీయ క‌ళాకారులు ఆండ్రా డే, మ్యాగీ రోజ‌ర్స్‌, టోనీ సుకార్‌, టెడ్ నాష్‌, దేబీ నోవా, రూఫ‌స్ వెయిన్‌రైట్ ప‌నిచేశారు. ఈ ఆల్బ‌మ్‌ను గ్రామీ అవార్డు విజేత క‌బీర్ సెహ‌గ‌ల్ ప్రొడ్యూస్ చేశారు. ద‌లైలామాకు ప్ర‌తిష్టాత్మ‌క గుర్తింపు రావ‌డం సంతోష‌క‌ర‌మ‌ని అంజ‌ద్ అలీ ఖాన్ పేర్కొన్నారు.

దలైలామా ఎవరు?

దలైలామా అనేది టిబెటన్ బౌద్ధ మతంలో, ముఖ్యంగా గెలుగ్ శాఖలో అత్యున్నత ఆధ్యాత్మిక నాయకుడి బిరుదు. ప్రస్తుత దలైలామా, టెన్జిన్ గయాట్సో, 14వ వారని మరియు అతను భారతదేశంలో ప్రవాసంలో నివసిస్తున్నారని 14వ దలైలామా పేర్కొన్నారు. దలైలామాలు బోధిసత్వుడైన అవలోకితేశ్వరుడి అవతారాలుగా భావించబడతారు.  

దలైలామా ఏ దేశానికి చెందినవారు?

1959లో చైనా సైన్యం టిబెట్‌ను ఆక్రమించిన తర్వాత ఆయన భారతదేశంలో బహిష్కరించబడ్డారు. 1960 నుండి ఆయన ధర్మశాలలో నివసిస్తున్నారు, దీనిని “లిటిల్ లాసా” అని పిలుస్తారు, ఇది టిబెటన్ ప్రభుత్వ ప్రవాస స్థానం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.