📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Underground: బంగారం కోసం భూగర్భంలో రోజూ 4 కిలోమీటర్లు.. ఎక్కడంటే?

Author Icon By Vanipushpa
Updated: February 12, 2026 • 4:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎవరైనా భూగర్భంలోకి లిఫ్ట్‌లో గంటసేపు వెళితే ఎలా ఉంటుందో ఊహించారా.. చాలామంది కొంచెం లోపలకి వెళ్లగానే భయంతో వణికిపోతారు. ఒకవేళ ఎవరైనా సాహసం చేసినా లోపలంతా చీకటిగా ఉండి ఏమి కానరాక బిక్కుబిక్కుమంటూ బయటకు వస్తుంటారు చాలామంది. అయితే దక్షిణాఫ్రికాలోని మ్పోనెంగ్‌లోని మైనర్లకు ఇది రోజువారీ జీవితంగా ఉందంటే నమ్మగలరా. అవును వీరు ప్రపంచంలోనే అత్యంత లోతైన బంగారు గని.. భూగర్భంలో దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాని దగ్గరకు ప్రతి రోజూ వెళుతుంటారు. అంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా కంటే ఐదు రెట్లు లోతుగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ గని గురించి ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.. ప్రపంచవ్యాప్తంగా అనేక బంగారు గనులు ఉన్నప్పటికీ.. వాటిలో అత్యధిక భాగం ఆఫ్రికా ఖండంలోనే ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణాఫ్రికా దేశం లోతైన భూగర్భ గనులకు ప్రసిద్ధి చెందింది.

Read Also: Trump: ఇరాన్‌తో ఒప్పందం కుదిరితే మంచిది..లేకుంటే చూడాలి మరి..

Underground: బంగారం కోసం భూగర్భంలో రోజూ 4 కిలోమీటర్లు.. ఎక్కడంటే?

ప్రపంచంలోనే అత్యంత లోతైన గనిగా గుర్తింపు

ఇక్కడి గనులు కేవలం బంగారమే కాకుండా, మైనింగ్ సాంకేతికతలో మానవ సామర్థ్యాన్ని, ధైర్యాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. భూమి లోతుల్లోకి వెళ్లి, తీవ్రమైన ఉష్ణోగ్రతలు, ప్రమాదాల మధ్య పనిచేసే గనికారులు ప్రపంచానికి అపారమైన సంపదను అందిస్తున్నారు. దక్షిణాఫ్రికాలోని టౌటోనా గని ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత లోతైన గనిగా గుర్తింపు పొందింది. సుమారు 3.9 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించిన ఈ Gold Mine, 2018లో మూసివేయబడే వరకు దశాబ్దాలపాటు లక్షల ఔన్సుల బంగారాన్ని ఉత్పత్తి చేసింది. వేలాది మంది కార్మికులు ఇందులో పని చేయడం ద్వారా ఈ గని ఒక సంపూర్ణ భూగర్భ నగరంలా మారింది.

భారీ పరిమాణంలో బంగారు ఖనిజం

ఈ గని లోతైన పనులకే ప్రసిద్ధి, భారీ పరిమాణంలో బంగారు ఖనిజం ఇక్కడ లభిస్తుందని చరిత్ర చెబుతోంది. రూ. 3 లక్షలు కోట్లు దాటిన గోల్డ్-సిల్వర్ ఇటిఎఫ్‌ ఆస్తులు.. కేవలం 5 నెలల్లోనే మూడు రెట్లు పెరుగుదల.. డ్రైఫోంటెయిన్ గని 3.42 కిలోమీటర్ల లోతుతో ఇప్పటికీ చురుకుగా పనిచేస్తున్న గనుల్లో ఒకటి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారులలో ఒకటిగా గుర్తింపు పొందింది. అలాగే క్లూఫ్ గని సుమారు 3.35 కిలోమీటర్ల లోతులో ఉండి.. బంగారంతో పాటు యురేనియంను కూడా ఉత్పత్తి చేస్తుంది. ఆధునిక మైనింగ్ పద్ధతులతో ఈ గనులు లోతుల్లో కూడా సమర్థవంతంగా పని చేస్తున్నాయి. ఆఫ్రికా వెలుపల చూస్తే, కెనడాలోని లారోండే గని సుమారు 3.26 కిలోమీటర్ల లోతుతో అక్కడి అత్యంత లోతైన గనిగా నిలిచింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

deepest mines in the world extreme working conditions gold exploration Gold Mining mining industry news mining workers life Telugu News online Telugu News Today underground mining

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.