Cyber Crime: సైబర్ నేరగాళ్లకు అడ్డాగా మారిన గోల్డన్ ట్రయంగి ల్లో ఒకటిగా వున్న కాంబోడియా దేశంలోని మారు మూల అటవీ ప్రాంతంలో రహస్యంగా కొనసాగుతున్న సైబర్ నేరాల(Cyber Crime) స్థావరాలపై ఆ దేశానికి చెందిన సైన్యం మంగళవారం మెరుపు దాడులు చేబట్టింది. ఈ దాడుల్లో సైబర్ డెన్లలో బంధింపబడి నేరగాళ్ల ఒత్తిడితో సైబర్ నేరాలు చేస్తున్న 11 వేల మంది విదేశీయులకు విముక్తి లభించింది. ఈ దాడుల్లో 1200 మంది సైబర్ నేరగాళ్లను ఆ దేశ సైన్యం అరెస్టు చేసింది.
Read Also: Thailand: డే కేర్ స్కూల్‌లో కాల్పులు
ఏర్పాటైన ప్రత్యేక కేంద్రాలు
ఈ సందర్బంగా వేల సంఖ్యలో సెల్ఫోన్లతో పాటు లక్షల సంఖ్యలో సిం కార్డులను పట్టుకున్నారు. ఈ సెల్ఫోన్లు, సిం కార్డులలో 90 శాతం భారత్కు చెందినవిగా తెలిసింది. కాంబోడియాలోని సైబర్ డెన్లలో ఈ స్థాయిలో దాడులు జరగడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారిగా చెబుతున్నారు.
సైబర్ డెన్లలో భారత్ కు చెందిన సిబిఐ, ఈడీ సహా అనేక పోలీసు విభాగాల పేరిట ఏర్పాటైన ప్రత్యేక కేంద్రాలు వుండగా వాటిని ఆ దేశ సైన్యం ధ్వంసం చేసింది. ఆసియా దేశాలకు చెందిన నిరుద్యోగులను ముఖ్యంగా భారతీయులను సైబర్ నేరగాళ్లు విదేశీ ఉద్యోగాల పేరిట ఎరవేసి వారిని బలవంతంగా కాంబోడియా తరలిస్తూ వారిచేత సైబర్ నేరాలు చేయిస్తుండ డం తెలిసిందే. సైబర్ నేరాలు చేసేందుకు నిరాకరించిన వారికి అన్న పానియాలు లేకుండా చేయడం, కరెంటు షాక్ లు ఇవ్వడం, చావబాదడం వం టివి చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.
విముక్తి పొందిన 11 వేల మంది
సైబర్ నేరగాళ్ల దాడుల్లో కొందరు చనిపోతుండగా మరికొందరు జీవచ్చవాలుగా మారి ఇష్టం లేకున్నా నేరాలు చేస్తున్నారు. కొందరు మాత్రం భారీగా డబ్బులు చెల్లించి బయటపడుతున్నారు. ఇలా బయటపడ్డ వారు భారత్కు వచ్చి తమ సహచరుల కష్టాలను నలుగురికి చెప్పడంతో కొందరిని కాంబోడియా సైన్యం కాపాడుతోంది. ఇలాంటిదే తాజాగా సైన్యం చేబట్టిన భారీ ఆపరేషన్. ఈ ఆపరేషన్లో పది వేల మందికి పైగా సైన్యం ఆయుధాలతో పాల్గొందని సమాచారం. సైన్యం దాడుల కారణంగా సైబర్ నేరగాళ్లు అనేక మంది పారిపోగా వారిని వెంటాడి పట్టుకున్నారు. కాగా సైబర్ డెన్లలో బంధింపబడి విముక్తి పొందిన 11 వేల మందిలో ఎనిమిది వేల మంది భారత్కు చెందిన వారేనని తెలిసింది. వీరిలో 1500 మంది తెలుగు రాష్ట్రాల వారు వున్నట్లు సమాచారం. దీనిపై కాంబోడియా దేశం భారత్కు సమాచారం అందించిందని తెలిసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: