CSIS report: ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దురాక్రమణ యుద్ధం ప్రారంభమైన తర్వాత రెండు దేశాల్లో కలిపి సుమారు 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ నివేదిక ఒకటి వెల్లడించింది. అమెరికాకు చెందిన ప్రముఖ థింక్‌ట్యాంక్ సెంటర్ ఫర్ స్ట్రాటిజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) విడుదల చేసిన తాజా నివేదికలో ఈ సంచలన గణాంకాలు వెలుగులోకి వచ్చాయి.
Read Also: Colombia plane crash: ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం
నివేదిక ప్రకారం, ఉక్రెయిన్ ప్రతిదాడుల్లో రష్యా వైపు కనీసం 12 లక్షల మంది మరణించారని, అందులో సుమారు 3.25 లక్షల మంది సైనికులు ఉన్నట్లు అంచనా వేసింది. మిగిలిన వారు సహాయక దళాలు, ప్రైవేట్ మిలిటరీ గ్రూపులు, అలాగే పౌరులుగా భావిస్తున్నారు. ఇది ఆధునిక కాలంలో రష్యాకు ఎదురైన అత్యంత భారీ ప్రాణనష్టం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అదేవిధంగా ఉక్రెయిన్ వైపు కూడా తీవ్ర నష్టం చోటుచేసుకున్నట్లు CSIS నివేదిక తెలిపింది. ఉక్రెయిన్ సైన్యంలో సుమారు 1.4 లక్షల మంది సైనికులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. అదనంగా, గాయాలు, గల్లంతు, రష్యా బందీలుగా తరలింపులు వంటి కేటగిరీల్లో మరో 6 లక్షల మంది వరకు ప్రభావితమైనట్లు నివేదిక అంచనా వేసింది.
ఈ యుద్ధం కేవలం సైనిక పరంగానే కాకుండా మానవతా పరంగానూ అపార నష్టాన్ని మిగిల్చిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ భద్రత, ఆర్థిక వ్యవస్థ, శరణార్థుల సమస్యలపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని CSIS పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: