తమ బిడ్డలు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి, మంచి జీతంతో బంగారు జీవితాన్ని అనుభవిస్తారనే కోటి ఆశలతో తల్లిదండ్రులు పిల్లలను విదేశీ చదువులను ప్రోత్సహిస్తున్నారు. లక్షల్లో అప్పులు చేసి, తమకు భారమైనా బిడ్డల సౌకర్యవంతమైన భవిష్యత్తు కోసం ఆ భారాన్ని గుండెల్లో దాచుకుని, చదివిస్తున్నారు. వృద్ధాప్యంలో తమను ఆదుకుంటారని గంపెండంత ఆశతో ఉండడం సహజమే. కానీ అనుకోని ఉపద్రవాలు, ప్రమాదాలతో( Crime) వారు ఇక తమకు కనిపించలేరు అనే సత్యాన్ని తెలిసినప్పుడు ఆ బాధను భరించడం ఎవరికైనా కష్టమే. ఆ కడుపుకోత బాధ వర్ణణాతీతం. రష్యాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన ఓ విద్యార్థి జీవితం విషాదాంతం అయ్యింది.
Read Also: SBI: 100 బిలియన్ డాలర్ల కంపెనీగా ఎస్ బిఐ
డ్యామ్ లో లభ్యమైన మృతదేహం
రష్యాలో చదివేందుకు అజిత్ సింగ్ చౌదరి(22) అనే యువకుడి మృతదేహం గురువారం ఓ డ్యామ్ లభ్యమైంది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజస్థాన్ లోని అల్వార్ జిల్లా కఫన్వాడ గ్రామానికి చెందిన అజిత్ సింగ్, 2023లో ఎంబీబీఎస్ చదివేందుకు రష్యాలోని ఉఫా నగరంలో ఉన్న బష్కిర్ స్టేట్ మెడికల్ యూనివర్సి టీలో చేరాడు. ఈ ఏడాది అక్టోబరు 19న ఉదయం 11 గంటల సమయంలోపాలు కొనుక్కొని వస్తానని చెప్పి హాస్టల్ నుంచి బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి అతను తిరిగి రాలేదు. ఈ క్రమంలో గురువారం వైట్ నదికి సమీపంలో ఉన్న ఓ డ్యామ్ లో అజిత్ మృతదేహాన్ని(Crime) అధికారులు గుర్తించారు. 19 రోజుల క్రితమే నది ఒడ్డున అతని బట్టలు, మొబైల్ ఫోన్, బూట్లులభించాయి. మృతదేహాన్ని అతని స్నేహితులు గుర్తించినట్లు ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ధ్రువీకరించింది. అజిత్ మరణవార్తను రష్యాలోని భారత రాయబారి కార్యాలయం అతని కుటుంబ సభ్యులకు తెలియజేసింది.
దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కేంద్ర మాజీ మంత్రి
ఈ ఘటనపై కేంద్ర మాజీ మంత్రి జితేంద్ర సింగ్ అల్వార్(Bhanwar Jitendra Singh) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో, ఎన్నో ఆశలతో కుటుంబం అజిత్ ను రష్యాకు పంపింది. అనుమానాస్పద పరిస్థితుల్లో ఒక ఆశాకిరణాన్నికోల్పోయాం’ అని ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, మృతదేహాన్ని త్వరగా భారత్ కు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ను కోరారు. అయితే ఈ ఘటనపై యూనివర్సిటీ యాజమాన్యం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: