ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు రాబ్ రైనర్ (Rob Reiner) కుమారుడిపై లాస్ ఏంజిల్స్ లోని వారి విలాసవంతమైన ఇంట్లో తన తల్లిదండ్రులను దారుణంగా హత్య చేసిన కేసులో రెండు ఫస్ట్ డిగ్రీ హత్య నేరాల కింద అభియోగాలు మోపనున్నట్లు చీఫ్ ప్రాసిక్యూటర్ మంగళవారం తెలిపారు. 32 ఏళ్ల నిక్ రైనర్ ఈ ఆరోపణలకు పాల్పడితే మరణశిక్షను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని లాస్ ఏంజిల్స్ జిల్లా అటార్నీ నాథన్ హూచ్ మాన్ పేర్కొన్నారు. ఈ అభియోగాలకు పెరోల్ లేదా మరణశిక్ష లేకుండా గరిష్టంగా జీవితఖైదు విధించవచ్చు అని ఆయన అన్నారు.
Read also: IBOMMA: ఐ బొమ్మ రవికి బిగ్ షాక్ 12 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి
Rob Reiner’s son arrested
చిన్న వయసులోనే చెడువ్యసనాలు
నిక్ రైనర్ ప్రస్తుతం నిర్బంధంలో ఉన్నారు. ఈయనకు ఎలాంటి బెయిల్ లేకుండా చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. టీనేజ్ వయసు నుంచే వ్యసనాలకు పాల్పడిన చరిత్ర రైనర్ కు ఉందని పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రుల మృతదేహాలను కనుగొన్న కొన్ని గంటల తర్వాత నిక్ రైనర్ ను పోలీసులు అరెస్టు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: