Crime: ఇటీవల కాలంలో పరువుహత్యల సంఖ్య పెరిగిపోతున్నాయి. కడప (Kadapa) జిల్లాలోని గండికోటలో తమకు నచ్చని అబ్బాయిని ప్రేమించిందని యువత సొంత అన్నయ్యలు హతమార్చారు. ఈ ఉదంతాన్ని ‘పరువుహత్య’గా పోలీసులు తేల్చారు. ఇలాంటి ఘనటే ఒకటి పాకిస్థాన్లో కూడా జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. బానో బీబీ, ఇహ్సానుల్లా జంటను (Bano Bibi and Ihsanullah couple) కొంతమంది గ్రైపుగా జీపుల్లో తీసుకువచ్చి మరీ గన్స్ తో కాల్చి చంపేశారు. నిర్జన ఎడారి ప్రదేశంలో జరిగిన ఈ హత్యకు సంబంధించిన వీడిని సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఇది పాకిస్థాన్లో జరిగిన పరువు హత్య అని తెలుస్తోంది. జూన్లో ఈ హత్య జరిగిందని అక్కడివవారు చెబుతున్నారు.
పరువు హత్యల పైన పాకిస్థాన్‌కి కలకలం – ప్రేమించారనే నేరానికి బానో బీబీ, ఇహ్సనుల్లా దారుణ హత్య
Crime: ఈ ఘటన తర్వాత దారుణానికి ఒడిగట్టిన 13 మందిని బలూచ్ పోలీసులు అరెస్టు చేసినట్లు (Arrested by the police) తెలుస్తోంది. వీరిలో అక్కడ ఒక గిరిజన తెగకు చెందిన అధిపతి సర్దార్ షెర్బాజ్ సతర్జాయ్ కూడా ఒకరు. పాక్లో ఆందోళన కలిగిస్తోన్న పరువుహత్యలు బానోబాబీ ఆమె ప్రియుడు ఇహ్సనుల్లాల హత్య పరువు హత్య అని చెబుతున్నారు. పాష్టో గిరిజన వంశానికి చెందిన బానో బీబీ జిర్గా వర్గానికి చెందిన ఇహ్సా నుల్లాలు ప్రేమించుకున్నారు. ఇది ఆమె అన్నతోపాటు ఎవరికీ నచ్చలేదు. అందుకే వారు సతక్జాయ్ ఆమోదంతో ప్రేమికులను ఇద్దరినీ ఒకేసారి చంపేశారు. చనిపోయినప్పుడు బబానూ బీబీ చేతిలో ఖురాన్ పట్టుకుని ఉంది, మీరు నన్ను కాల్చడం తప్ప ఏమీ చేయలేరని.. నాతో ఏడడుగులు నడవండి.. ఆ తర్వాత మీరు నన్ను కాల్చి చంపొచ్చని బానూ బీబీ చివరి మాటలు మాట్లాడినట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది.
బానో బీబీ హత్యపై పాక్‌లో అలజడి
బానో బీబీ హత్య తర్వాత దీనికి సంబంధించిన వీడియో పాకిస్థాన్లో వైరల్ అయింది. దీంతో అక్కడంతా ఆగ్రహావేశాలు చెలరేగాయి. దీంతో అక్కడంతా ఆగ్రహావేశాలు చెలరేగాయి. దీంతో బలూచ్ పోలీసులు వెంటనే గిరిజన నాయకుడు సతక్జామ్తో సహా 13మందిని అరెస్ట్ చేశారు. ఉగ్రవాదం, కరువు, సంప్రదాయ ముసుగులో అమానవీయతలు పాకిస్థాన్లో ఉగ్రవాదం వేళ్లూనికునిపోయింది. అనేక ఉగ్రవాద సంస్థలకు పాక్ ప్రభుత్వం మద్దతునిస్తున్నది. ఈ ఉగ్రవాద సంస్థలే దేశ ఆర్థికవనరులకు తీవ్రవిఘాతం కలిగిస్తున్నాయి. ప్రపంచదేశాల సాయం అందకుండా చేస్తున్నాయి. తద్వారా పాకిస్థాన్లో ఒకవైపు కరవు, అధిక ధరలతో సామాన్యప్రజల జీవనవిధానం దయనీయంగా ఉంది. వీటికితోడు ఇలాంటి పరువుహత్యల సంఖ్య కూడా పెరిగిపోతున్నది. పాక్ మానవ హక్కుల కమిషన్ 2024లో అక్కడ 405 పరువు హత్యలు జరిగాయని చెబుతోంది. ఇందులో ఎక్కువగా మహిళలు 335 మంది ఉండగా.. 119 మంది పురుషులు ఉన్నారు. ఈ పరువు హత్యలు ఎక్కువగా బెలూచిస్తాన్, పంజాబ్లోలో జరుగుతున్నాయి. బంధువులే వీటిని ఎక్కువగా చేస్తున్నారని అంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Donald Trump: భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపా: ట్రంప్