థాయ్‌లాండ్(Thailand)లో ఘోర ప్రమాదం జరిగింది. థాయ్‌లాండ్‌లో కదులుతున్న రైలుపై క్రేన్ జారిపడి పెను ప్రమాదం జరిగింది. నిర్మాణ పనులకు వినియోగించే క్రేన్ పడడంతో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 22 మంది మృతిచెందగా, మరో 30 మంది వరకూ గాయపడ్డారు. బ్యాంకాక్‌కు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిఖియో జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Read Also: Bank Of Maharashtra: 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్
హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ కోసం క్రేన్ సాయంతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. బ్యాంకాక్ నుంచి ఉబాన్ రచతాని రాష్ట్రానికి వెళ్తున్న రైలుపై నిర్మాణ పనుల్లో ఉపయోగించే క్రేన్ పడింది. ఆ తీవ్రతకు బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని బోగీల్లో మంటలు చెలరేగాయి. పోలీసులు, సహాయ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలు అదుపులోకి వచ్చినట్లు చెప్పారు. ప్రమాద సమయంలో రైలులో 195 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. హైస్పీడ్ రైలు ప్రాజెక్టులో భాగంగా పని చేస్తున్న నిర్మాణ క్రేన్ ఒక్కసారిగా కూలి రైలు బోగీ పై పడటంతో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఒక బోగీలో స్వల్పంగా మంటలు చెలరేగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 150 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: