India public holidays : ప్రభుత్వం గానీ, ప్రైవేట్ రంగం గానీ… ఉద్యోగులకు సెలవులు అంటే కేవలం విశ్రాంతి మాత్రమే కాదు, మళ్లీ కొత్త ఉత్సాహంతో పని చేయడానికి దొరికే శక్తి కూడా. ప్రపంచవ్యాప్తంగా దేశాలవారీగా సెలవుల సంఖ్య అక్కడి సంస్కృతి, మతపరమైన సంప్రదాయాలు, జాతీయ ప్రాధాన్యతలను బట్టి మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యధిక ప్రభుత్వ సెలవులు ఉన్న దేశంగా భారత్ నిలవడం విశేషం.
భారతదేశం తన సాంస్కృతిక వైవిధ్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. జాతీయ సెలవులు, గెజిటెడ్ హాలిడేస్, రిస్ట్రిక్టెడ్ హాలిడేస్, మతపరమైన పండుగలు, ప్రాంతీయ ప్రత్యేకతల ఆధారంగా ఇచ్చే సెలవులు అన్నింటిని కలిపితే భారత్‌లో ఏడాదికి సగటున సుమారు 42 సెలవులు ఉంటాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించేలా అన్ని మతాల పండుగలకు ఇక్కడ సమాన ప్రాధాన్యం ఉంటుంది. సమాఖ్య వ్యవస్థ కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాల మేరకు అదనపు సెలవులు ప్రకటించగలగడం కూడా ఈ సంఖ్య పెరగడానికి కారణం.
Read Also: HYD: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం సక్సెస్ మీట్
భారత్ తర్వాత అత్యధిక సెలవులు ఉన్న దేశంగా నేపాల్ నిలుస్తోంది. అక్కడ హిందూ, బౌద్ధ సంప్రదాయాల ప్రకారం ఏడాదికి సుమారు 35 సెలవులు ఉంటాయి. మూడో స్థానంలో ఉన్న ఇరాన్‌లో దాదాపు 26 సెలవులు ఉండగా, వీటిలో (India public holidays) ఎక్కువగా ఇస్లామిక్ క్యాలెండర్‌కు సంబంధించిన పండుగలు, నౌరూజ్ వంటి వేడుకలు ఉంటాయి. మయన్మార్ కూడా ఇరాన్‌తో సమానంగా 26 సెలవులు కలిగి ఉంది. బౌద్ధ సంప్రదాయాల్లో ముఖ్యమైన వాటర్ ఫెస్టివల్ (థింగ్యాన్)కు అక్కడ దీర్ఘ సెలవులు ఇస్తారు.
మన పొరుగుదేశమైన శ్రీలంకలో ఏడాదికి సుమారు 25 సెలవులు ఉంటాయి. పౌర్ణమి రోజులు (పోయా డేస్) మరియు మతపరమైన వేడుకలకు అక్కడ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
అయితే, అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో సెలవుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. బ్రిటన్‌లో ఏడాదికి కేవలం 10 సెలవులు మాత్రమే ఉండగా, నెదర్లాండ్స్, సెర్బియాల్లో 9 సెలవులు, మెక్సికోలో 8 సెలవులు మాత్రమే అమల్లో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత తక్కువగా కేవలం 6 ప్రభుత్వ సెలవులు ఉన్న దేశంగా వియత్నాం నిలిచింది.
ఈ గణాంకాలను గమనిస్తే, ఆసియా దేశాల్లో సంస్కృతి, మతపరమైన సంప్రదాయాల కారణంగా సెలవులు ఎక్కువగా ఉంటాయని, పాశ్చాత్య దేశాల్లో పని సంస్కృతికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల సెలవులు తక్కువగా ఉంటాయని అర్థమవుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: