📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

Latest Telugu News : Core 5 : అమెరికా ఏర్పాటు చేసే ‘కోర్ ఫైవ్’ కూటమిలో భారత్ ?

Author Icon By Sudha
Updated: December 12, 2025 • 3:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రెండోసారి అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు దేశాలపై అధిక టారిఫ్‌లు, వలసలు, హెచ్‌1బీ వీసా వంటి వాటిపై కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ప్రపంచ రాజకీయాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టే ప్రయత్నంలో ట్రంప్‌ ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌తో కలిసి ఓ శక్తిమంతమైన కూటమిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. C5 లేదా కోర్‌ 5 పేరుతో ఈ కూటమిని (Core 5 Group) ఏర్పాటు చేయనున్నట్లు అమెరికా మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.

Read Also : http://India&China: వీసా నిబంధనలు సడలింపు.. చైనీయుల కోసం గేట్లు తెరిచిన భారత్..

Core 5

ఇప్పటికే ఉన్న జీ7 కూటమి లానే సీ5ని తెరపైకి తెచ్చే యోచనలో ట్రంప్‌ ఉన్నట్లు సదరు కథనాలు వెల్లడిస్తున్నాయి. అమెరికన్ మీడియా సంస్థ ‘పొలిటికో’ ఈ మేరకు ఒక కథనాన్ని ప్రచురించింది. అమెరికా, భారత్‌, రష్యా, చైనా, జపాన్‌తో ఈ (Core 5 Group) సీ5 కూటమిని ఏర్పాటు చేసే యోచనలో ట్రంప్‌ ఉన్నట్లు సదరు కథనం పేర్కొంది. సంపద, ప్రజాస్వామ్య పాలన వంటి జీ7 నిబంధనలతో సంబంధం లేకుండా, ప్రపంచంలోని ప్రధాన సైనిక, ఆర్థిక, జనాభా శక్తిగా ఉన్న దేశాలతో ఈ కొత్త కూటమిని ఏర్పాటు చేయాలన్నది ట్రంప్‌ ఆలోచనగా తెలుస్తోంది. అయితే, ఈ కొత్త కూటమిలో యూరప్ దేశాలకు చోటు లేకపోవడం గమనార్హం. మరోవైపు ఈ కథనాలను వైట్‌హౌస్‌ ఖండించింది. అలాంటి ప్రతిపాదన ఏమీ లేదని ప్రెస్ సెక్రటరీ హన్నా కెల్లీ స్పష్టం చేశారు. కానీ, జాతీయ భద్రతా నిపుణులు మాత్రం ఇది ట్రంప్ మార్క్ ఆలోచనేనని చెబుతున్నారు. C5ని అమెరికా వ్యూహాత్మక ఆలోచనకు అనుగుణంగా ఉండే అవకాశం ఉందంటున్నారు. ట్రంప్‌ తలచుకుంటే ఏదైనా సాధ్యమే అంటూ చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Core Five India Foreign Policy International Relations latest news strategic alliance Telugu News US alliance

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.