📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Colonel Sofiya Qureshi: కల్నల్ పై వివాదాస్పద వ్యాఖ్యలు – మంత్రిపై ఎఫ్‌ఐఆర్, క్షమాపణలు

Author Icon By Shobha Rani
Updated: May 15, 2025 • 11:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆర్మీ ఆఫీసర్ కల్నల్ సోఫియా ఖురేషి(Colonel Sofiya Qureshi) పై అభ్యంతరకరమైన వ్యాఖ్య చేసినందుకు మధ్యప్రదేశ్ క్యాబినెట్ మంత్రి కున్వర్ విజయ్ షా (Vijay Shah) బుధవారం క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ, “ఇటీవల నేను చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నాను. అంతేకాకుండా నా హృదయం నుండి క్షమాపణలు కూడా కోరుతున్నాను” అని అన్నారు. “కల్నల్ సోఫియా ఖురేషి (Colonel Sofiya Qureshi) నాకు నిజమైన సోదరి కంటే ఎక్కువ, ఆమె వారిపై ప్రతీకారం తీర్చుకుంది. నాకు (ఎవరినైనా బాధపెట్టాలనే సంకల్పం లేదా కోరిక లేదు). నేను చెప్పిన దాని గురించి ఎవరైనా చెడుగా భావించినట్లయితే, నన్ను క్షమించండి” అని పేర్కొన్నారు.

Colonel Sofiya Qureshi: కల్నల్ పై వివాదాస్పద వ్యాఖ్యలు – మంత్రిపై ఎఫ్‌ఐఆర్, క్షమాపణలు

న్యాయవ్యవస్థ స్పందన – హైకోర్టు సుమోటో
కాగా అంతకంటే ముందు మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఇండోర్‌లోని మోవ్‌లోని మాన్పూర్ పోలీస్ స్టేషన్‌లో ఎంపీ క్యాబినెట్ మంత్రి విజయ్ షా (Vijay Shah) పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కల్నల్‌ ఖురేషిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా స్వీకరించి, నాలుగు గంటల్లోగా మంత్రిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డీజీపీని ఆదేశించింది. మోవ్‌లోని మాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయుకుండా గ్రామంలో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో విజయ్ షా చేసిన వివాదాస్పద, అనుచిత వ్యాఖ్యలు వివాదానికి కారణం అయ్యాయి. మే 12న మంత్రి “హల్మా” కార్యక్రమంలో పాల్గొని కల్నల్ ఖురేషి(Colonel Sofiya Qureshi) పై వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆ ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లంతా బీజేపీ ఎంపిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రసంగంలో షా ఇలా అన్నాడు, “మా కుమార్తెల సిందూరాన్ని ధ్వంసం చేసిన వారికి గుణపాఠం చెప్పడానికి ప్రధాని మోదీ వారి సోదరిని పంపారు.” అని పేర్కొన్నారు.
రాజీనామాకు ఒత్తిడి – బీజేపీలో హడావుడి
కాగా ఈ వివాదంతో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ దృష్ట్యా మంత్రి విజయ్ షా (Vijay Shah) ను ఎప్పుడైనా తన పదవికి రాజీనామా చేయమని కోరవచ్చు. భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) సెక్షన్లు 152, 196(1)(బి), 197(1)(సి) కింద మాన్పూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. విజయ్ షాపై చర్యలు తీసుకోవాలని మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్ యాదవ్ సైతం ఆదేశించారు. విజయ్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత ఆయన రాజీనామా కోసం ఇప్పుడు ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యమంత్రి నివాసంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బిడి శర్మ, పార్టీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ హితానంద్ శర్మ పాల్గొన్న ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ ముగ్గురు నాయకుల సమావేశ ప్రధాన అజెండా మంత్రి విజయ్ షా (Vijay Shah) రాజీనామా చేసే అవకాశం ఉందని వర్గాలు సూచిస్తున్నాయి.

Read Also: Pakistan: పాకిస్థాన్‌కు టర్కీ మద్దతు – భారత్‌ కు వెన్నుపోటు

Apology Controversial remarks on Colonel – FIR against Minister Google news Google News in Telugu Latest News in Telugu Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.