📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Congo: కాంగోలో ఊచకోత.. 52 మంది హతం

Author Icon By Sharanya
Updated: August 19, 2025 • 1:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేవుడు మానవుడికి విచక్షణాజ్ఞానాన్ని ఇచ్చాడు. జంతువులకు ఈ భావం ఉండదు. తోటి మనిషిని ప్రేమించుకోమని, సాయం చేయాలని అన్నిమత గ్రంథాలు చెబుతాయి. కానీ మానవత్వం రోజురోజుకు మంటకలిసిపోతున్నది. మనిషికి మనిషే శత్రువుగా మారుతున్నాడు. తోటిమనిషిని హతమారుస్తున్నాడు. అనాగరిక చర్యలకు పాల్పడూ యధేచ్ఛగా మానవ ఊచకోతకు పాల్పడుతున్న వారికి ఎలాంటి శిక్ష వేసినా తప్పులేదు. మతం ముసుగులో మారణహోమానికి
పాల్పడుతున్నారు. ఆఫ్రికా ఖండంలోని కాంగో (Congo) దేశంలో కనీవిని ఎరుగని రీతిలో మానవ హత్యలు చోటు చేసుకోవడం విషాదకరం.

Congo

రెచ్చిపోయిన ఇస్లామిక్ స్టేట్ మద్దతుదారులు

ఇస్లామిక్ స్టేట్ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు రెచ్చిపోయి కత్తులు, గొడ్డళ్లతో సామాన్య పౌరులపై దాడి చేసి 52మందిని దారణంగా హతమార్చారు. కాంగో (Congo) సైన్యంతో ఇటీవల జరిగిన యుద్ధంలో పరాజయం పాలైన అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ADF) సభ్యులు ప్రతీకారంగా ఈ మారణకాండకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. నిద్రలో ఉన్న వారిని లేపి, వారి చేతులు కట్టేసి, అమానుషంగా కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపారని స్థానిక వర్గాలు తెలిపాయి.

మొత్తం ఆరువేలమంది మరణించినట్లు రికార్డు

2013 నుంచి ఇప్పటి వరకు వారి దాడుల్లో దాదాపు 6వేలమంది ప్రాణాలు కోల్పోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ దుర్మార్గపు సంస్థపై అమెరికా, ఐక్యరాజ్య సమితి భద్రతామండలి ఇప్పటికే ఆంక్షలు విధించాయి. కాగా మెలియా గ్రామం (Melia village) లోనే దాదాపు 30మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. మొత్తం మృతుల సంఖ్యలో ఎనిమిది మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని వెల్లడించారు. ఈ ఘటనలో 52మంది అక్కడిక్కడే మృతి
చెందగా, కొందరిని ఇళ్లలోనే కిరాతకంగా కాల్చి చంపినట్లు చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు హెచ్చరించారు.

గత నెలలో కూడా ఏడీఎఫ్ తిరుగుబాటుదారులు ఒక కాథలిక్ చర్చి ప్రాంగణంలో కాల్పులు జరిపి 38మందిని బలిగొన్న విషయం గుర్తుచేశారు. స్థానిక ప్రజలు ఇంకా భయం గుప్పెట్లోనే జీవిస్తున్నారని ఇక్కడి అధికారులు తెలిపారు. ఉగాండా కాంగో సరిహద్దు ప్రాంతాల్లో చురుకుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఏడీఎఫ్ అనే ఈ తిరుగుబాటు సంస్థ, గత కొన్ని సంవత్సరాలుగా పౌరులనే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతోంది. ఒకవైపు ఆకలి, కరువు మరోవైపు మతం పేరుతో జరుగుతున్న ఊచకోతతో దేశం నిత్యం సమస్యలవలంలో నలిగిపోతున్నది. అభివృద్ధి కుంటుపడుతున్నది. సమాజంలో ప్రజలు సురక్షితంగా ఉన్నప్పుడే వారు అన్నిరంగాల్లో వృద్ధి చెందగలరు. మతం పేరుతో హత్యలకు పాల్పడడం హేయమైన చర్యని ఐక్యరాజ్యసమితి పేర్కొన్నది.

కాంగోలో 52 మంది మరణించిన ఘటన ఎక్కడ జరిగింది?

ఈ ఘోరం డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో జరిగింది. ముఖ్యంగా తిరుగుబాటు గ్రూపులు ప్రభావం చూపుతున్న ప్రాంతంలో ఈ హింస చోటుచేసుకుంది.

ఈ దాడికి వెనుక ఎవరు ఉన్నారని అనుమానిస్తున్నారు?

స్థానిక మీడియా నివేదికల ప్రకారం, ఈ ఊచకోత వెనుక ADF (Allied Democratic Forces) అనే మిలిటెంట్ గ్రూప్ ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ గ్రూప్ ISIS‌తో అనుబంధం కలిగి ఉందని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/us-student-visas-cancelled-foreign-students-issue/international/532427/

African Conflicts Attack 52 Dead Breaking News Congo Massacre Congo violence latest news Mass Killing in Congo Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.