📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

Latest News: Congo – కాంగోలో పడవ ప్రమాదం..193 మంది జలసమాధి!

Author Icon By Anusha
Updated: September 13, 2025 • 3:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల పడవ ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. తరచూ సాంకేతిక కారణాలతో ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ప్రాణం ఎంతో విలువైనది. దాన్ని కాపాడుకునేందుకు ఎన్నో పాట్లు పడుతుంటాం. అంతకుమించి జాగ్రత్తలు కూడా తీసుకుంటాం. కానీ కొందరికి ధనాపేక్షతో ప్రజల పాణాలతో చెలగాటమాడుతుంటారు. అధిక డబ్బు సంపాదనతో పడవల్లో కెపాసిటికి మించి ప్రయాణీకులను ఎక్కించుకుని, వారి ప్రాణాలనుతీస్తున్నారు.

తాజాగా మధ్య ఆఫ్రికా దేశమైన కాంగో (Congo) లో రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఘోర పడవ ప్రమాదాల్లో కనీసం 193మంది మరణించారు. వందలాదిమంది గల్లంతయ్యారు. ఈ విషాదకర ఘటన సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం సాయంత్రం లుకొలీలా ప్రాంతంలోని కాంగో నదిలో దాదాపు 500మంది ప్రయాణీకులతో వెళ్తున్న ఓ పడవలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో పడవ అదుపుతప్పి నదిలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 107మంది మరణించగా, 209 మందిని సురక్షితంగా కాపాడినట్లు హ్యుమానిటీస్ వ్యవహారాల మంత్రిత్వశాఖ (Ministry of Humanities Affairs) తన నివేదికలో తెలిపింది.

Congo

కెపాసిటికి మించి ప్రయాణీకుల వల్లే ప్రమాదాలు

కాగా పడవల్లో కెపాసిటి (Capacity) కి మించి ప్రయాణీకులను చేరవేసే ప్రయత్నంలోనే అధికంగా ప్రమాదాలకు గురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అధిక బరువు, రాత్రివేళల్లో ప్రయాణించడం వంటి కారణాల వల్లే ఈ రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు అక్కడి ప్రభుత్వం మీడియాకు తెలిపింది. అయితే దీన్ని స్థానిక పౌర సమాజ సంస్థ ఆరోపణలు మరోలా ఉన్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని స్థానిక పౌర సమాజ సంస్థ ఆరోపించింది.

ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. అసలు పడవలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఎంతమంది సురక్షితంగా బయటపడ్డారు అనేదానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కాంగోలో రోడ్డు మార్గాలు (Roadways) సరిగా లేకపోవడం వల్ల అక్కడి ప్రజలు నదులు, సరస్సులలో పడవ ప్రయాణాలనుఆశ్రయిస్తుంటారు. అంతేకాక సరైన భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం, ఓవర్లోడింగ్, పడవ నిర్వహణ లోపాల వల్ల తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కాగా మరణించిన వారిలో అధికంగా విద్యార్థులే ఉండడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/earthquake-in-russia-tsunami-warnings-after-massive-earthquake-in-russia/international/546452/

at least 193 dead Boat accidents boat fire Breaking News Central Africa Congo Congo River hundreds missing latest news Lukolila region Telugu News Tragic Incident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.