📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి

Telugu News: Colombia: లోయలోపడ్డ స్కూలు బస్సు.. 17మంది దుర్మరణం

Author Icon By Sushmitha
Updated: December 15, 2025 • 3:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మనజీవితం అంతలో కనిపించి, అంతలోనే మాయమయ్యే ఆవిరివంటిది. ఎక్కడ.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. పెరుగుతున్న ప్రమాదాలతో అనేకులు మరణిస్తున్నారు. ఇందులో ఒక ప్రమాదంలో 17మంది విద్యార్థులు మరణించిన హృదయవిదారక ఘటన ఇది. కొలంబియా (Colombia) దేశంలోని ఆంటియోక్వియా ప్రాంతంలో అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న ఒక స్కూల్ బస్సు (School bus) ఆకస్మాత్తుగా అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది.

Read Also: H4 Visa: ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్.. గుండెల్లో రైలు

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 17మంది ప్రాణాలు కోల్పోయారని, సంఘటనా స్థలంలో భయానక వాతావరణం నెలకొందని అధికారులు దృవీకరించారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో బస్సు పూర్తిగా ధ్వంసమైందని స్థానియ మీడియా పేర్కొంది.

Colombia School bus falls into ravine, 17 dead

బీచ్ లో కేరింతలాడారు..ఇంతలో మృత్యువు

విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆ జ్ఞాపకాలను మదిలో దాచుకుని, ఉల్లాసంతా తిరిగి తమ ఇళ్లకు పయనమయ్యారు. మరికొన్ని గంటల్లో గమ్యస్థానాలకు చేరుకుంటామని ఆనందించారు. కానీ ఇంతలో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. మరణించిన వారిలో అత్యధికులు 16 నుంచి 18 ఏళ్ల వయసు కలిగిన విద్యార్థులే కావడం పలువురినీ కలచివేసింది. ఈ విషయాన్ని ఆ ప్రాంత గవర్నర్ ఆండ్రెస్ జూలియన్ అధికారికంగా వెల్లడించారు. ఆనందంగా సాగాల్సిన వీరి ప్రయాణం ఇలా అర్థాంతరంగా ముగిసిపోవడంతో విద్యార్థుల కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంది.

గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషమం 

కాగా ఈ ప్రమాదంలో మరో 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరికి అత్యవసరచికిత్సను అందిస్తున్నారు. అయితే వీరి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని సమాచారం. బస్సు లోయలో పడ్డం వల్ల గాయపడ్డవారిని రెస్క్యూటీమ్ (Rescue team) పైకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, వారికి అండగా ఉంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రమాదానికి కారణాలను పోలీసులు లోతుగా పరిశీలిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

17 fatalities reported Accident Investigation Colombia bus accident Colombia road tragedy fatal school bus accident Google News in Telugu Latest News in Telugu School bus plunges into ravine Telugu News Today tragic bus crash transport disaster.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.