Colombia bus accident : కొలంబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ విద్యార్థులతో ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోవడంతో కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం డిసెంబర్ 14 ఆదివారం ఉదయం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
అంటియోకియా రాష్ట్ర గవర్నర్ ఆండ్రేస్ జూలియన్ తెలిపిన వివరాల ప్రకారం, అంటియోకెయో హై స్కూల్‌కు చెందిన విద్యార్థులు స్కూల్ ట్రిప్ అనంతరం కారిబియన్ పట్టణం టోలు నుంచి మెడెలిన్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపు తప్పి సుమారు 80 మీటర్ల లోతైన లోయలో పడిపోయిందని పేర్కొన్నారు.
Read also: Sarpanch Election: తెలంగాణలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, (Bus accident) అయితే డ్రైవర్‌కు క్షణకాలం నిద్ర (మైక్రోస్లీప్) వచ్చి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ జోనాథన్ టబోర్డా కోకాకోలో కూడా మృతి చెందినట్లు నిర్ధారించారు.
గాయపడిన వారిని సమీపంలోని సెగోవియా మరియు రిమేడియోస్ ప్రాంతాల్లోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొలంబియా ఆరోగ్య శాఖ ప్రకారం, గాయపడిన వారిలో 12 మంది మైనర్లు, 4 మంది పెద్దలు ఉన్నారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని జాతీయ రోడ్డు భద్రతా సంస్థ వెల్లడించింది.
ఈ ఘటనపై అంటియోకెయో హై స్కూల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ, విద్యార్థులందరికీ మానసికంగా అండగా ఉంటామని ప్రకటించింది. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోతే ఇలాంటి విషాదాలు జరుగుతాయని అధికారులు హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: