📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

అమెరికా నిబంధనలకు కొలంబియా ఓకే

Author Icon By Vanipushpa
Updated: January 27, 2025 • 2:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణం చేసిన రోజున నుంచి అనేక దేశాలకు భయం పుడుతున్నది. ఇందులో కొలంబియా కూడా చేరింది. తాజాగా కొలంబియా విధిస్తామంటూ ట్రంప్‌ చేసిన హెచ్చరికలకు కొలంబియా దిగొచ్చింది. అగ్రరాజ్యం పెట్టిన నిబంధనలకు అంగీకరించింది. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ తాజాగా వెల్లడించింది. అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులపై ట్రంప్‌ కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వారందరినీ ప్రత్యేక విమానాల్లో స్వదేశాలకు పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్‌ చర్యను కొలంబియా తీవ్రంగా వ్యతిరేకించింది. వలసలతో వస్తున్న అమెరికా సైనిక విమానాలను తమ దేశంలోకి అనుమతించేది లేదని ఆ దేశాధ్యక్షుడు గుస్తావో పెట్రో స్పష్టం చేశారు. వలసదారులన గౌరవంగా పంపించేందుకు నిబంధనలు రూపొందిస్తేనే వాటిని అనుమతిస్తామని తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే తమ దేశంలోకి వచ్చిన అమెరికా సైనిక విమానాలను వెనక్కి పంపినట్లు చెప్పారు. అయితే, గుస్తావో పెట్రో నిర్ణయంపై ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుంకాలతో పాటు కఠిన వీసా ఆంక్షలు విధిస్తామని ట్రంప్‌ హెచ్చరించారు.

కొలంబియా ఉత్పత్తులపై సుంకాలు 50 శాతానికి పెంచుతున్నట్లు కీలక ప్రకటన చేశారు. అంతేకాదు కొలంబియన్‌ ప్రభుత్వ అధికారుల వీసాలను వెంటనే రద్దు చేస్తానని తెలిపారు. ఈ క్రమంలోనే కొలంబియా దిగొచ్చినట్టు తెలుస్తోంది. ట్రంప్‌ విధానాలకు ఓకే చెప్తూ.. అక్రమవలసదారులు అందరినీ స్వీకరించేందుకు కొలంబియా అంగీకరించినట్లు వైట్‌హౌస్‌ వెల్లడించింది. శరణార్థులను తీసుకొస్తున్న అమెరికా మిలిటరీ విమానాలపై ఎటువంటి ఆంక్షలు, జాప్యం ఉండదని అక్కడి ప్రభుత్వం పేర్కొన్నట్టు తెలిపింది. ఇక కొలంబియా వెనక్కి తగ్గడంతో.. ఆ దేశంపై విధించిన సుంకాలు, పలు ఆంక్షలను నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.

colombia Immigrants USA

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.