📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Turkey : కుప్పకూలిన టర్కీ ఆర్థిక వ్యవస్థ.. అదానీ ఒప్పందం రద్దు

Author Icon By Shobha Rani
Updated: May 17, 2025 • 1:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడులకు కౌంటర్ గా పాకిస్థాన్ భారత్ లోని కాశ్మీర్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్లతో దాడి చేసింది. పాక్ నుంచి దూసుకొచ్చిన దాదాపు 600 డ్రోన్లను సమర్థవంతంగా నేల కూల్చినట్లు భారత రక్షణశాఖ పేర్కొంది. అయితే ఈ డ్రోన్లు టర్కీ (Turkey) దేశం.. పాకిస్థాన్ కు సరఫరా చేసింది. దీంతో టర్(Turkey) కీపై భారత్ లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే బాయికాట్ టర్కీ నినాదం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. టర్కీ (Turkey) ఉత్పత్తులను భారత్ లో బ్యాన్ చేయాలని పలు వ్యాపార సంఘాలు తీర్మానించాయి. అంతేకాక పకడ్బందీగా అమలు చేశాయి. అటు భారత్ ఉత్పత్తులను కూడా టర్కీకు ఎగుమతి చేయకుండా నిలిపివేశాయి. ఈ క్రమంలో టర్కీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంతో బాయికాట్ టర్కీ ప్రారంభించిన రెండు రోజులకే టర్కీ ఆర్థిక వ్యవస్థ భారీగా పతనమైనట్లు వార్తలు వస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్థాన్‌పై భారీ వైమానిక దాడులు చేపట్టింది.

Turkey : కుప్పకూలిన టర్కీ ఆర్థిక వ్యవస్థ.. అదానీ ఒప్పందం రద్దు

విమానయాన రంగంలో భారత్ కీలక నిర్ణయాలు
అంతేకాక మేకిన్ ఇండియా, ఏవియేషన్, మెట్రో రైలు.. తదితర రంగాల్లో టర్కీకి చెందిన పలు కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు వీటన్నింటినీ రద్దు చేసేందుకు భారత్ సిద్ధమైంది. దీంతో టర్కీ తలపట్టుకుంది. పాకిస్థాన్ కు సాయం చేసి పెద్ద తప్పు చేశామని అనుకుంటోంది. అంతేకాక టర్కీ బ్రాండ్లను సైతం నిషేధించాలంటూ దేశవ్యాప్తంగా ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో టర్కీ తయారుచేసే వస్త్రాలను ప్రముఖ రిటైల్‌ సంస్థలు నిలిపివేశాయి. ఇది టర్కీ ఆర్థిక వ్యవస్థకు బిగ్ షాక్ అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టర్కీకి చెందిన “సెల్ బీ” అనే విమానయాన సంస్థతో భారత ప్రభుత్వం, అదానీ గ్రూప్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి.
భారత ఉత్పత్తుల ఎగుమతులు నిలిపివేత
భారత్‌లోని విమానాశ్రయాల కార్గో సేవలతో పాటు ఇతర సేవలను అందించిన ఈ సంస్థకు ఇది భారీ దెబ్బ.
అంతేకాక టర్కీకి చెందిన సెల్ బీ అనే విమానయాన సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని భారత్ ఉపసంహరించుకుంది. దీంతో ఈ కంపెనీ షేరు విలువకు బాగానే దెబ్బ పడింది. భారతీయ విమానాశ్రయాల్లో సరకుల రవాణాతో పాటు ఇతర కార్గో సేవల్ని అందించిన ఈ సంస్థతో ఉన్న ఒప్పందాన్ని భారత్ తాజాగా రద్దు చేసుకుంది. ఈ సమయంలోనే అదానీ సంస్థ సైతం సెల్ బీతో తాను చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో.. ఈ సంస్థకు చెందిన షేర్లు తీవ్రంగా పడిపోయాయి. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టర్కీ తీసుకున్న వైఖరి దాని ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. భారత్ చేపట్టిన వ్యూహాత్మక చర్యలు టర్కీకి మేలు చేయలేదు. బాయికాట్ టర్కీ ఉద్యమం కేవలం ప్రజల స్థాయికే కాక, ప్రభుత్వ వ్యవహారాల్లోనూ ప్రభావం చూపడం గమనార్హం. భారత్ ఆర్థిక శక్తిగా ఎలా ఎదిగిందో, దాని ప్రభావాన్ని గ్లోబల్ మార్కెట్లపై ఎలా చూపగలదో ఇది ఒక ఉదాహరణగా నిలుస్తోంది.

Read Also: Severe storms: అమెరికా మిడ్‌వెస్ట్‌ను ముంచెత్తిన తుఫాను, ఏడుగురు మృతి

Breaking News in Telugu Collapsed Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Turkish economy..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.