📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

CM Revanth: దావోస్ పర్యటనలో ప్రముఖులు

Author Icon By Anusha
Updated: January 21, 2026 • 10:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) దావోస్ పర్యటనలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రపంచ ఆర్థిక వేదిక World Economic Forum సమావేశాల సందర్భంగా నిర్వహించిన ‘Join the Rise’ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విజన్‌ను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, రాష్ట్ర మంత్రులు పక్కపక్కనే కూర్చుని పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు ఒకే వేదికపై కనిపించడంతో ఈ ఈవెంట్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

Read Also: HYD: బేగంపేట్ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా

ప్రోగ్రాంకు మెగాస్టార్ ఎందుకు వెళ్లారనే దానిపై క్లారిటీ లేదు

ఆప్యాయంగా మాట్లాడుకుని కలిసి విందులో పాల్గొన్నారు. అయితే గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు పాల్గొనే ఈ ప్రోగ్రాంకు మెగాస్టార్ ఎందుకు వెళ్లారనే దానిపై క్లారిటీ రాలేదు .ఈ కార్యక్రమంలో ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించారు. అదే సమయంలో తెలంగాణ AI ఇన్నోవేషన్ హబ్ (TAIH), తెలంగాణ నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030లను ఆవిష్కరించడం ద్వారా రాష్ట్ర భవిష్యత్ దిశను స్పష్టంగా చూపించారు. స

CM Revanth: Celebrities on Davos visit

మావేశంలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, చెరువులు-కుంటల పునరుజ్జీవనం వంటి గేమ్ చేంజర్ ప్రాజెక్టుల వివరాలను వివరించారు. అలాగే కోర్, ప్యూర్, రేర్ అనే కొత్త ఆర్థిక వృద్ధి జోన్ల ప్రణాళికలను ప్రస్తావిస్తూ, తెలంగాణలో అపార పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. టెక్నాలజీ, నైపుణ్యాలు, అనుభవాల పరంగా గ్లోబల్ కంపెనీలతో భాగస్వామ్యం కోరుకుంటున్నామని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Chiranjeevi davos visit Join the Rise latest news Revanth Reddy Telangana Vision Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.