📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

CM Chandrababu: పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏపీలో ఉంది

Author Icon By Anusha
Updated: July 27, 2025 • 2:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పెట్టుబడుల వర్షం కురిసే రోజులు సమీపిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రస్తుతం, సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన సింగపూర్‌లో భారత హైకమీషనర్ శిల్పక్ ఆంబులేతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలపై ముఖ్యంగా చర్చలు జరిగాయి.చంద్రబాబు (CM Chandrababu) మాట్లాడుతూ, పోర్టులు, గ్రీన్ ఎనర్జీ, మెడికల్, సెమీకండక్టర్, హైడ్రోజన్ ఎనర్జీ వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రం పెట్టుబడులపై దృష్టి పెట్టి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రోగ్రెసివ్ పాలసీలు అమలు చేస్తోందన్నారు. సింగపూర్‌కు చెందిన కంపెనీలు ఈ అవకాశాలను గుర్తించి ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని చెప్పారు.గతంలో సింగపూర్‌తో కలిసి అమరావతి ప్రాజెక్టును చేపట్టామని కొన్ని కారణాల వల్ల రాజధాని ప్రాజెక్టు నుంచి సింగపూర్ వైదొలిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రంగంలో

2019-24 మధ్య జరిగిన పరిణామాలు దీనికి కారణమయ్యాయన్నారు. ప్రస్తుతం తన పర్యటనలో గతంలో జరిగిన అపోహల్ని తొలగించి రికార్డులను సరిచేసేందుకు ప్రయత్నిస్తానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పాలసీలను, అవకాశాలను చంద్రబాబు భారత హై కమిషనర్‌కు వివరించారు. ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇప్పటికే విశాఖలో ఎన్టీపీసీ, కాకినాడలోనూ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు (Green hydrogen projects) పట్టాలెక్కాయని సీఎం వివరించారు. ఇండియా క్వాంటం మిషన్‌లో భాగంగా అమరావతిలో తొలి క్యాంటం వ్యాలీ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం తెలియజేశారు. విశాఖలో దిగ్గజ ఐటీ కంపెనీ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందని తెలిపారు.రాయలసీమలో డిఫెన్సు, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సంస్థల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని అన్నారు.

CM Chandrababu: పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏపీలో ఉంది

హౌసింగ్ ప్రాజెక్టుల గురించి మంత్రి నారాయణ వివరించారు

సింగపూర్ నుంచి భారత్‌ కు పెట్టుబడులు రావాలని దీనికి ఏపీ గేట్ వేగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఏపీలో పెట్టుబడులకు అవసరమైన సహకారాన్ని అందించాలని హైకమిషనర్ ఆంబులేను సీఎం చంద్రబాబు కోరారు. మరోవైపు సింగపూర్‌లో 83 శాతం మేర పబ్లిక్ హౌసింగ్ ప్రాజెక్టులు ఉన్నాయని భారత హై కమిషనర్ వివరించారు. దీనిపై ఏపీలో చేపడుతున్న హౌసింగ్ ప్రాజెక్టుల గురించి మంత్రి నారాయణ వివరించారు. అలాగే విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, భవిష్యత్ ఆలోచనల్ని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ భారత హై కమిషనర్‌కు వివరించారు. ఏపీలో ఇప్పటికే ఏర్పాటు అవుతున్న ప్రముఖ విద్యా సంస్థల గురించి తెలిపిన మంత్రి ఏపీకి త్వరలో తరలివచ్చే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామని లోకేశ్ స్పష్టం చేశారు. 

ఆగ్నేసియాలోని సింగపూర్ లాంటి దేశాల విద్యార్ధులను

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టెక్ నిపుణులకు ఆగ్నేయాసియాలో ప్రత్యేకించి సింగపూర్‌లో డిమాండ్ ఉందని భారత హై కమిషనర్ ఆంబులే సీఎం చంద్రబాబుకు వివరించారు. అమెరికా తరహాలోనే ఆగ్నేసియాలోని సింగపూర్ లాంటి దేశాల విద్యార్ధులను, టెక్ నిపుణులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. ఈ అంశంపై సింగపూర్‌లోని భారత రాయబార కార్యాలయం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని ముఖ్యమంత్రికి తెలియచేశారు. సింగపూర్ నుంచి ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి ఆయన వివరించారు.ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల ఉత్పత్తి, షిప్ బిల్డింగ్, పోర్టు కార్యకలాపాల నిర్వహణ, డేటా సెంటర్ల ఏర్పాటు, ఫార్మా తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని సీఎంకు వివరించారు.

ఏపీ, సింగపూర్ సంబంధాలు మరింత బలపడతాయని

సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఆసియా పసిఫిక్ దిగ్గజ కంపెనీలు ఎస్టీటీ, కెప్పెల్, కాపిటాల్యాండ్, ఈక్వినిక్స్, పీఎస్ఏ తదితర సంస్థల విస్తరణకు అవకాశాలు ఉన్నట్టు వెల్లడించారు. ఏఐ, స్టార్టప్‌లు, వైద్య పరికరాల రంగంలో పరిశోధన, ఏపీ, సింగపూర్ యూనివర్సిటీల మధ్య భాగస్వామ్యం కుదుర్చుకునే అంశంపైనా సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, పి.నారాయణ, టీజీ భరత్ తో పాటు ఏపీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ భేటీ ద్వారా ఏపీ – సింగపూర్ సంబంధాలు మరింత బలపడతాయని, పెట్టుబడులకూ వేదికగా మారుతాయని రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబు నాయుడు యాజమాన్యంలో ఉన్న కంపెనీ ఏది?

హెరిటేజ్ గ్రూప్ (Heritage Group) అనేది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్థాపించిన సంస్థ. 1992లో ఈ కంపెనీని ప్రారంభించారు.

చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకం ఏది?

చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రవేశపెట్టిన ముఖ్యమైన పథకాలలో “ముఖ్యమంత్రి యువనేస్తం” (Mukhyamantri Yuvanestham) పథకం ఒకటి. ఈ పథకం ద్వారా 20 నుండి 30 ఏళ్ల మధ్య వయస్సున్న నిరుద్యోగ యువతకు ప్రతి నెల రూ.1000 ఆర్థిక సహాయం అందజేస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Kondapur: కొండాపూర్ లో రేవ్ పార్టీ .. 11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Andhra Pradesh Investments AP ports investment Breaking News CBN brand recognition Chandrababu Naidu Singapore visit green energy in Andhra Pradesh latest news progressive policies in AP Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.