Global warming : భూమి వేడెక్కిపోతున్న వాస్తవం మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆస్ట్రేలియా నేతృత్వంలోని ఒక అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం, (Global warming) 2023లో జరిగిన తీవ్ర వడగాల్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ముఖ్యంగా మానవ చర్యల వల్ల ఏర్పడిన వాతావరణ మార్పులే ప్రధాన కారణమని ఈ నివేదిక స్పష్టం చేసింది.
ఈ అధ్యయనం ప్రకారం, 2023లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1,78,486 మంది అదనంగా మరణించారు. ప్రతి పది లక్షల మందిలో 23 మంది అకాల మరణం పాలయ్యారు. వీరిలో 97,000 మంది మానవ ప్రేరిత భూతాపం కారణంగానే మరణించారని శాస్త్రవేత్తలు తేల్చారు.
గత ఏడాది చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి — పారిశ్రామిక విప్లవానికి ముందు స్థాయిలతో పోలిస్తే 1.45 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా.
దక్షిణ ఐరోపా దేశాల్లో ఈ వేడి అత్యంత ప్రభావం చూపింది. ప్రతి పది లక్షల మందికి 120 మరణాలు అక్కడే నమోదయ్యాయి.
Read also : తీన్మార్ మల్లన్న పార్టీ గుర్తింపు కోసం కీలక ఆదేశాలు
వడగాల్పుల తీవ్రత కారణంగా గుండె, శ్వాసకోశ సమస్యలు, మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి ఆరోగ్యం క్షీణించి మరణాలకు దారితీసిందని నివేదిక చెబుతోంది.
పెరుగుతున్న భూతాపం నియంత్రణ కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని, పర్యావరణ పరిరక్షణ వ్యూహాలను అమలు చేయాలని పరిశోధకులు హెచ్చరించారు.
అలాగే, శిలాజ ఇంధనాల వినియోగం వల్ల ఉద్గారమవుతున్న గ్రీన్‌హౌస్ వాయువులే ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రధాన కారణమని వారు పేర్కొన్నారు.
వాతావరణ మార్పుల నియంత్రణకు మరియు ప్రజారోగ్య పరిరక్షణకు ప్రపంచ దేశాలు కలసి చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం మరోసారి గుర్తు చేసింది.
Read Hindi News : Hindi vaartha
Epaper : epaper.vaartha.com
Read also :