యెమెన్(Yemen)లో హత్య కేసు(Murder Case)లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియ(Nimisha Priya) ఉరిశిక్షను వాయిదా పడినట్లు సుప్రీంకోర్టు(Suprem Court)కు కేంద్రం శుక్రవారం తెలిపింది. ఆమెను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్రం తరపున హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు. నిమిష ప్రియ సురక్షితంగా తిరిగి రావాలని కేంద్రం కోరుకుంటుందని వెల్లడించారు.
ప్రభుత్వం స్పందనపై సుప్రీంకోర్టు సంతృప్తి
అయితే ప్రభుత్వం స్పందనపై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తంచేసింది. నిమిష ప్రియ కేసులో కేంద్రం సాధ్యమైన ప్రయత్నాలు చేస్తోందని తెలిపింది. తొలుత ఆమెకు క్షమాభిక్ష దక్కితే తర్వాత బ్లడ్ మనీ అంశం చర్చకు వస్తుందని న్యాయస్థానానికి వివరించారు. అనంతరం కేసు తదుపరి విచారణను ధర్మానసం ఆగస్టు 14కి వాయిదా వేసింది. ఉరిశిక్ష ఎదుర్కొంటున్న 38 ఏళ్ల ప్రియను కాపాడటానికి దౌత్య మార్గాలను ఉపయోగించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపడుతోంది.
న్యాయవాదుల బృందం కోర్టుకు అభ్యర్థన
అదే సమయంలో విచారణ సందర్భంగా నిమిష ప్రియ తరఫున న్యాయవాదుల బృందం కోర్టుకు ఓ అభ్యర్థన చేసింది. ఈ కేసులో బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరిపేందుకు వీలుగా యెమెన్ వెళ్లేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోరింది. దీంతో ప్రస్తుతం ఆ దేశానికి వెళ్లకుండా ప్రయాణ ఆంక్షలు ఉన్నందున కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని న్యాయస్థానం పేర్కొంది. ఇందుకోసం ప్రభుత్వం వద్ద అభ్యర్థన చేసుకునేలా పిటిషనర్లకు అనుమతి కల్పించింది. అయితే యెమెన్ దేశస్థుడి హత్య కేసులో నిమిష ప్రియకు జులై 16వ తేదీన మరణశిక్ష అమలు చేయాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో అక్కడి ప్రభుత్వ వాయిదా వేసింది. బ్లడ్ మనీపై బాధిత కుటుంబంతో చర్చలు జరిపేందుకు మరింత సమయం ఇవ్వాలని భారత ప్రభుత్వం అప్పటికే చేసిన అభ్యర్థనకు ఆ దేశం సానుకూలంగా స్పందించింది .
యెమెన్‌లో మరణశిక్ష విధించబడిన భారతీయ మహిళ ఎవరు?
నిమిషా ప్రియ
హత్య నేరం రుజువై మరణశిక్ష విధించబడింది. నిమిషా ప్రియ విచారణ అరబిక్‌లో జరిగింది మరియు ఆమెకు అనువాదకురాలు లేదా తగిన న్యాయ సలహాదారుని అందించలేదని నివేదించబడింది. నిమిషా మరణశిక్షను యెమెన్‌లోని ఉన్నత న్యాయస్థానం తిరిగి ధృవీకరించింది. సేవ్ నిమిషా ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ ఏర్పడింది.
యెమెన్లో భారతీయ నర్సుకు మరణశిక్ష ఎందుకు విధించబడింది?
హత్య కేసులో దోషిగా తేలిన తర్వాత మరణశిక్ష విధించబడిన భారతీయ నర్సు ఉరిశిక్షను యెమెన్ అధికారులు వాయిదా వేసినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. స్థానిక వ్యక్తిని చంపినందుకు మరణశిక్ష విధించబడిన నిమిషా ప్రియకు జూలై 16న ఉరిశిక్ష అమలు చేయాలని నిర్ణయించినట్లు ఆమెను రక్షించడానికి పనిచేస్తున్న ప్రచారకులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Ashok Gajapathi Raju: టీడీపీకి రాజీనామా చేసిన అశోక్ గజపతిరాజు