📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి!

Chris Woakes: టెస్ట్ లో ఓడిపోవడం బాధగా ఉంది

Author Icon By Anusha
Updated: August 7, 2025 • 1:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒక ఆటగాడిగా జట్టు కోసం చేయగలిగే త్యాగం ఏంటో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్ మరోసారి చాటిచెప్పాడు. 2025లో భారత జట్టుతో జరిగిన ఐదవ టెస్ట్ మ్యాచ్ చివరి రోజున అతను చేసిన సాహసం కేవలం మ్యాచ్‌ను గెలిపించే ప్రయత్నం మాత్రమే కాదు… అది నిజమైన క్రీడాస్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది. భుజం నొప్పితో బాధపడుతూ స్లింగ్‌లో ఉన్న చేతితో బ్యాటింగ్‌కు రావడం అన్నది సాధారణ విషయం కాదు. కానీ వోక్స్ (Chris Woakes) చేసిన ఈ ధైర్యపు పని క్రీడాభిమానులను ఆశ్చర్యంలో ముంచేసింది.ఓవల్ మైదానంలో ప్రారంభమైన ఐదో టెస్ట్ తొలి రోజే ఫీల్డింగ్ చేస్తుండగా వోక్స్ భుజానికి తీవ్ర గాయమైంది. వైద్యులు అతన్ని మిగతా మ్యాచ్ నుండి తప్పించారు. ఇదే సందర్భంలో అటు ఇంగ్లండ్ బ్యాటింగ్‌ కూడా తేలిపోతుండటంతో మ్యాచ్ భారత్‌ వైపు మొగ్గింది. చివరి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు గెలిచేందుకు 35 పరుగులు మాత్రమే కావలసిన దశలో, వారు ఇప్పటికే 9 వికెట్లు కోల్పోయారు.

బాటింగ్‌కు రావడంతో

భారత్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఆ సమయంలో అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నారు.చేతికి స్లింగ్ వేసుకున్న వోక్స్‌ అప్పటిదాకా డ్రెస్సింగ్‌ రూమ్‌ (Dressing room) లోనే ఉన్నాడు. అయితే జట్టులో ఎవరికీ అతను మైదానానికి వస్తాడనే అంచనా లేదు. కానీ ఒక్కసారిగా అతను గార్డును తీసుకొని బాటింగ్‌కు రావడంతో ప్రేక్షకులు, కామెంటేటర్లు, ప్రత్యర్థులు అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తనకు తీవ్ర నొప్పి ఉన్నప్పటికీ వోక్స్‌ తన జట్టును ఒంటరి పోరాటంతో గెలిపించాలనే ఆత్మవిశ్వాసంతో క్రీజులోకి వచ్చాడు. అయితే భారత బౌలర్ల దాటికి అతను ఎక్కువ సేపు నిలవలేకపోయినా, తన ధైర్యంతో అందరి గుండెల్లో స్థానం సంపాదించాడు.

Chris Woakes:

వెళ్లకూడదనే ఆలోచన

ఈ ఘటన తర్వాత వోక్స్ మీడియాతో మాట్లాడుతూ,”ఆ మ్యాచ్‌లో మేము ఓడిపోవడం నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. గెలిచి ఉంటే బాగుండేది. అయితే, జట్టు కష్టాల్లో ఉందప్పుడు. అందుకే, బ్యాటింగ్‌ (Batting) కు వెళ్లకూడదనే ఆలోచన నాకు ఒక్క క్షణం కూడా రాలేదు. ఒకవేళ 100 పరుగులు చేయాల్సి ఉన్నా నేను కచ్చితంగా బరిలోకి దిగేవాడిని. నా ధైర్యాన్ని చూసి కొందరు భారత ఆటగాళ్లు వచ్చి అభినందించడం సంతోషాన్నిచ్చింది. అయినా, నా స్థానంలో ఏ ఆటగాడు ఉన్నా ఇదే పని చేసేవాడు” అని తెలిపాడు.

ఆ సమయంలో

గాయంతో పరుగులు తీయడం ఎంత కష్టంగా మారిందో వివరిస్తూ, “మొదటి పరుగు తీయడమే అత్యంత నరకంగా అనిపించింది. నొప్పిని తట్టుకోవడానికి కోడెయిన్ తీసుకున్నాను. అయినా చాలా బాధగా ఉంది. సహజంగానే చేయి కట్టుకుని ఉన్నా మామూలుగా పరిగెత్తేందుకు ప్రయత్నించాను. ఆ సమయంలో నా భుజం మళ్లీ ఊడిపోయిందేమోనని నిజంగా ఆందోళన చెందాను. అందుకే వెంటనే హెల్మెట్ తీసి, పంటితో గ్లోవ్ తొలగించి భుజాన్ని చెక్ చేసుకున్నాను” అని వోక్స్ ఆ భయానక అనుభవాన్ని పంచుకున్నాడు.చివరికి ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయినప్పటికీ, జట్టు కోసం వోక్స్ చూపిన తెగువ క్రీడాభిమానుల హృదయాలను గెలుచుకుంది.

క్రిస్ వోక్స్ ఏ దేశానికి చెందినవాడు?

వోక్స్ ఇంగ్లండ్ దేశానికి చెందిన క్రికెటర్.

క్రిస్ వోక్స్ పూర్తి పేరు ఏమిటి?

క్రిస్ వోక్స్ పూర్తి పేరు క్రిస్టఫర్ రోగర్ వోక్స్ (Christopher Roger Woakes).

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/sachin-tendulkar-sachin-tendulkar-praised-gills-batting/sports/527324/

Breaking News chris woakes batting with injury chris woakes shoulder injury England Cricket Team India vs England 5th Test latest news oval test match 2025 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.