📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Dalai Lama: దలైలామాకు చైనా కౌంటర్

Author Icon By Sudheer
Updated: July 2, 2025 • 6:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టిబెటన్ బౌద్ధుల ఆధ్యాత్మిక నేత, 14వ దలైలామా (Dalai Lama) వారసుడి ఎంపికపై చైనా ప్రభుత్వంతో ఆయనకు తీవ్ర విభేదాలు తలెత్తుతున్నాయి. బుధవారం చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ, తదుపరి దలైలామాను ఎంపిక చేసే అధికారం తమకే ఉందని, ఇది కేంద్ర ప్రభుత్వ ఆమోదంతోనే జరగాల్సిన ప్రక్రియని తెలిపారు. బంగారు కలశం ద్వారా లాటరీ తీయడం లాంటి సంప్రదాయాలను ఆధారంగా చూపుతూ, తాము చేర్చిన నియమాల ప్రకారం ఎన్నిక జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

సంప్రదాయాల ప్రకారమే ఎంపిక జరగాలి: దలైలామా స్పష్టత

తన 90వ జన్మదినాన్ని పురస్కరించుకుని, దలైలామా వీడియో సందేశం ద్వారా తన వారసుడి ఎంపికపై స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన ప్రకారం, వారసుడు ఎంపిక ప్రక్రియను టిబెటన్ (Tibetan) బౌద్ధ సంప్రదాయాల ప్రకారమే చేపట్టాలి. ఇందులో మఠాధిపతులు, ధర్మరక్షకులతో సంప్రదింపులు జరగాలని, గత అనుభవాలు, సాంప్రదాయాలను పునరావృతం చేయాలని దలైలామా సూచించారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ‘గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్’ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

చైనా జోక్యానికి బౌద్ధుల తీవ్ర వ్యతిరేకత

టిబెటన్ బౌద్ధులు తమ మత పరంపరలో చైనా ప్రభుత్వ జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చైనా నియంత్రణలో ఉన్న టిబెట్‌లోని ప్రజలతో పాటు, భారతదేశం సహా వివిధ దేశాల్లో ఉన్న ప్రవాస బౌద్ధులు కూడా తమ విశ్వాసాలపై చైనా ఆధిపత్యాన్ని అంగీకరించడం లేదని స్పష్టం చేస్తున్నారు. దలైలామా గతంలో ఎన్నిసార్లు తన పునర్జన్మ చైనా వెలుపలనే జరుగుతుందని స్పష్టం చేసినా, బీజింగ్ మాత్రం దానిని ఖండిస్తూ వస్తోంది. ప్రస్తుతం తాను ఎవరినీ వారసుడిగా ప్రకటించలేదన్న విషయం కూడా దలైలామా స్పష్టంచేశారు. ఇది చైనా మత స్వేచ్ఛపై అవలంబిస్తున్న నియంత్రణ విధానాలకు ఓ పెద్ద సవాల్‌గా మారింది.

Read Also : Floods : హిమాచల్ ప్రదేశ్లో వరదలు.. 51మంది మృతి

China's counter Dalai Lama Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.