తాము కూడా ‘శాంతికాముకులం’ అంటూ డ్రాగన్ దేశం చైనా కూడా కొత్తరాగం అందుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తోపాటు చైనా కూడా ప్రపంచ వ్యాప్తంగా అనేక యుద్ధాలు ఆపిందని.. శాంతి చర్చల్లో పాల్గొందంటూ కొత్త పలుకు పలికింది. (China) తాజాగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26మంది చనిపోయారు. అనంతరం మే 7న ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారతదేశం ‘ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor) పేరుతో యుద్ధం చేసింది. నాలుగు రోజుల తర్వాత మే 10న ఇరుదేశాల చర్చలతో కాల్పుల విరమణ జరిగింది. అయితే ఈ క్రెడిట్ ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొట్టేసే యత్నం చేశారు. తాను భారత్ పై వాణిజ్య హెచ్చరికలు, బెదిరింపులతో భారత్ కాల్పుల వివరమణకు అంగీకరించాయని ప్రకటించారు.
అయితే ట్రంప్ వాదనను భారతదేశం తీవ్రంగా ఖండించింది. కాల్పుల విరమణ విషయంలో మూడోవ్యక్తి ప్రమేయం లేదని, పాక్-భారత్ ల మధ్య కుదిరిన ఒప్పందంతోనే యుద్ధాన్ని ఆపినట్లు నరేంద్రమోదీ, జైశంకర్ లు చెప్పారు. అయినా ట్రంప్ ఏమాత్రం తగ్గలేదు. నిత్యం మీడియా సమావేశాలలో ట్రంప్ తాను ఎనిమిది యుద్ధాలను ఆపానని, భారత్-పాక్ యుద్ధాన్ని కూడా ఆపినట్లు పాడినపాటే పడుతూ వస్తున్నారు. తనకు నోబెల్ శాంతి బహుమతి కూడా ఇవ్వాలనే డిమాండ్ అప్పట్లో చేశారు. ఇలా ఇప్పటివరకు ట్రంప్ దాదాపు 70సార్లు చెప్పారు.
Read also: America: మాజీ అధ్యక్షుడు కెన్నెడీ మనవరాలు హఠాన్మరణం
చైనా కూడా ఇదే పాట
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలను తగ్గించడంలో ట్రంప్ తో పాటు చైనా కూడా కృషి చేసిందని విదేశాంగ మంనరతి వాంగ్ యి ప్రకటించారు. (China) భారత్-పాకిస్తాన్ తోపాటు ఉత్తర మయన్మార్ ఉద్రిక్తతలు, కంబోడియా-థాయ్లాండ్, ఇజ్రాయెల్-పాలస్తీనా ఉద్రిక్తతలు, ఇరాన్ అణు సమస్యతో పాటు ప్రపంచ సంఘర్షణలకు బీజింగ్ శాంతికర్తగా వ్యవహరించిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారితీసింది. ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో భారత్ దే పైచేయిగా అయినవిషయం తెలిసిందే. పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో భారత్ ను యుద్ధం ముగింపు పలకాలని చేసిన విజ్ఞప్తి మేరకు రెండుదేశాల సంక్షేమం కోసం కాల్పుల విరమణను ప్రకటించాయి. ఇదే విషయం భారత్ పదేపదే చెబుతున్నా ట్రంప్ ధోరణి మారలేదు. ఇప్పుడు చైనా కూడా ఇదే రాగాన్ని అందుకోవడం విశేషం.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: