📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

China: తైవాన్​కు ఆయుధాల అమ్మకం పై అమెరికాకు చైనా హెచ్చరిక

Author Icon By Vanipushpa
Updated: December 27, 2025 • 4:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తైవాన్‌కు ఆయుధాలను విక్రయించాలని అమెరికా తీసుకున్న నిర్ణయంపై చైనా(China) మండిపడింది. తైవా
న్​కు ఆయుధాలను విక్రయిస్తే భారీ ముల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అంతేకాదు, తైవాన్​కు గత కొన్నేళ్లుగా ఆయుధాల సరఫరాలో పాల్గొన్న 20 రక్షణ కంపెనీలు, 10 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్​లపై చైనా విదేశాంగ శాఖ ఆంక్షలను విధించింది. ఈ ఆంక్షలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రకటించింది. ఈ మేరకు గ్లోబల్ టైమ్స్ వార్త సంస్థ నివేదించింది. అమెరికా తైవాన్‌కు ఆయుధాలు సరఫరా చేయడం అంటే ‘వన్-చైనా సిద్ధాంతం’తో పాటు చైనా-అమెరికా సంయుక్త ఒప్పందాలకు విరుద్ధంగా వ్యవహరించడమే అని బీజింగ్ ఆరోపించింది. ఈ చర్యలు చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యమేనని, దేశ సార్వభౌమాధికారాన్ని, భౌగోళిక సమగ్రతను దెబ్బతీస్తున్నాయని వెల్లడించింది.

Read Also: Bangladesh unrest : బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత, గాయకుడు జేమ్స్ కచేరీ రద్దు, రాళ్ల దాడి

China

చైనా ఆంక్షలు విధించిన కంపెనీల జాబితాలో

నార్త్‌రోప్ గ్రుమ్మన్, బోయింగ్ (సెయింట్ లూయిస్), ఎల్3 హారిస్ మ్యారిటైమ్ సర్వీసెస్, గిబ్స్ అండ్ కాక్స్, రెడ్ క్యాట్ హోల్డింగ్స్, టీల్ డ్రోన్స్ వంటి 20 దిగ్గజ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. చైనాలో ఈ కంపెనీలకు ఉన్న స్థిర, చరాస్తులన్నింటినీ స్తంభింపజేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, చైనా వ్యక్తులు లేదా సంస్థలు ఈ కంపెనీలతో ఎలాంటి వ్యాపార ఒప్పందాలు చేసుకోకూడదని నిషేధించింది. తైవాన్​కు ఆయుధాల సరఫరాలో కీలకంగా వ్యవహరించిన ఆండూరిల్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు పామర్ లక్కీతో సహా 10 మంది ఎగ్జిక్యూటివ్​ల విషయంలో కూడా బీజింగ్ కీలక కామెంట్లు చేసింది. వీరు చైనాలోకి ప్రవేశించడంపై పరిమితులు విధించడమే కాకుండా, చైనాలో ఉన్న వీరి ఆస్తులపై ఆంక్షలు విధించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

arms sales China warning China’s military response International Politics Taiwan weapons sale Taiwan-US defense Telugu News online Telugu News Paper Today news US-China relations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.