పాకిస్థాన్ విషయంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. చైనా స్పేస్ ప్రోగ్రామ్ పాకిస్థాన్‌తో జట్టుకట్టాలని చూస్తోంది. ఈ క్రమంలో స్వల్పకాలిక మిషన్లలో భాగంగా పాకిస్థాన్ వ్యోమగామిని అంతరిక్షంలోని చైనా స్పేస్ స్టేషన్ వద్దకు త్వరలో తీసుకెళ్లనుంది. అందుకోసం చైనా వ్యోమగాములతో కలిసి పాకిస్థాన్ వ్యోమగామికి శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు డ్రాగన్ ప్రకటన విడుదల చేసింది. కాగా, చైనా తీసుకున్న నిర్ణయం అంతరిక్ష పరిశోధనలో చైనా దూకుడును, ఇతర దేశాలతో భాగస్వామ్యం కావడానికి డ్రాగన్ సంసిద్ధతను హైలైట్ చేస్తుంది.
Read Also: Trump -Jinping: ట్రంప్, జిన్‌పింగ్ భేటీ..ఒకరిపై ఒకరు ప్రశంసలు
2030 నాటికి చంద్రునిపై ఒక వ్యక్తిని దింపాలనే లక్ష్యం
2030 నాటికి వ్యోమగాములను చంద్రునిపైకి దింపడానికి చైనా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చైనా మ్యాన్డ్ స్పేస్ ప్రోగ్రామ్ ప్రతినిధి జాంగ్ జింగ్బో తెలిపారు. అంతరిక్ష పరిశోధనలో అగ్రగామిగా ఉండాలనే చైనా ప్రతిష్టాత్మక ప్రణాళికల్లో భాగంగా దాని అంతరిక్ష కేంద్రానికి వెళ్లే తదుపరి వ్యోమగాముల బృందాన్ని పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం చంద్రునిపై ఒక వ్యక్తిని ఉంచే పరిశోధన, అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతీది సజావుగా సాగుతోందన్నారు.
చైనాలోని జియుక్వాన్ ప్రయోగ కేంద్రం
సొంత అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్‌ను పూర్తి చేయడానికి చైనా వ్యోమగాములను పంపుతోంది. ఇది డ్రాగన్ విస్తృత అంతరిక్ష పరిశోధన ప్రణాళికలలో భాగం. వ్యోమగాముల ప్రతి బృందం ఆరు నెలలు అంతరిక్ష కేంద్రం లోపల ఉండి, పరిశోధనలు చేస్తుంది. ఈ స్టేషన్‌లో చేరిన తాజా సిబ్బందిలో జాంగ్‌లు, వు ఫీ, జాంగ్ హాంగ్ జాంగ్ ఉన్నారు. వారు శుక్రవారం రాత్రి 11:44 గంటలకు చైనాలోని జియుక్వాన్ ప్రయోగ కేంద్రం నుంచి బయలుదేరుతారు. జాంగ్ గతంలో స్పేస్ స్టేషన్‌కు షెన్ జౌ 15 మిషన్‌లో భాగంగా ఉన్నారు. ఈ పర్యటనలో వ్యోమగాములు తమతో పాటు నాలుగు ఎలుకలను కూడా తీసుకువెళ్లనున్నారు.
అంతరిక్ష ప్రయోగాల్లో డ్రాగన్ దూకుడు
అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకెళ్తున్న డ్రాగన్ సొంత స్పేస్ స్టేషన్ తియాంగాంగ్‌కు వ్యోమగాములను పంపుతోంది. కొన్నేళ్లుగా పాకిస్థాన్ ఉపగ్రహాలను నింగిలోకి పంపిస్తోన్న చైనా, తాజాగా పాక్ వ్యోమగాములను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో తొలి విదేశీ అతిథిగా పాక్ వ్యోమగామిని అంతరిక్ష కేంద్రానికి పంపనుంది. ఇందుకు సంబంధించిన పాక్- చైనా ఒప్పందం చేసుకున్నాయి. ఈ డీల్ పై ఇరుదేశాల అంతరిక్ష పరిశోధనా కేంద్రాలు సంతకాలు ఇప్పటికే చేసేశాయి. ఇస్లామాబాద్‌లో కొన్నాళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ హాజరయ్యారు.
పాక్‌కు అన్ని విధాలా అండగా డ్రాగన్
గత కొన్నాళ్లుగా పాక్, చైనా మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో పాక్‌కు అంతరిక్ష రంగంలోనే కాకుండా నౌకాదశం విషయంలో కూడా సాయపడుతోంది. అత్యాధునిక జలాంతర్గామిని పాక్‌కు ఇచ్చింది. ఎనిమిది హేంగోర్ క్లాసిక్ జలాంతర్గాముల కోసం చైనాతో పాకిస్థాన్ దాదాపు 5 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా రెండో జలాంతర్గామిని హుబేయ్ ప్రావిన్స్‌లో అందజేసినట్లు చైనా మీడియా గతంలో తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: