📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

China : పక్క దేశాలను వణికిస్తున్న చైనా త్రీగోర్జెస్ ఆనకట్ట.. ఆందోళనలో భారత్

Author Icon By Pooja
Updated: December 21, 2025 • 11:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చైనా నిర్మిస్తున్న మెగా జలవిద్యుత్ ప్రాజెక్ట్ త్రీ గోర్జెస్ ఆనకట్ట ఇప్పుడు భారత్‌కు తీవ్రమైన ఆందోళనగా మారింది. యార్లుంగ్ సాంగ్పో నదిపై నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ చుట్టూ పారదర్శకత లేదని భారత్‌తో పాటు అంతర్జాతీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రంగా మారనున్న ఈ ఆనకట్టను జాతీయ భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్మిస్తున్నామని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పేర్కొన్నారు.

Read also: Water dispute: సింధూ జలాల ఒప్పందంపై పాక్ ఆవేదన.. భారత్‌పై ఇషాక్ దార్ విమర్శలు

China

వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి ఇప్పటికే ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్ ద్వారా బీజింగ్ తన ఇంధన అవసరాలు పెంచుకోవడమే కాకుండా భారత సరిహద్దు ప్రాంతాలపై వ్యూహాత్మక నియంత్రణను బలపర్చాలని చూస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

చైనా వ్యూహాత్మక అడుగులేనా?

న్యూఢిల్లీకి చెందిన ఆసియా సొసైటీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ అసిస్టెంట్ డైరెక్టర్ రిషి గుప్తా మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ చైనా తీసుకుంటున్న స్పష్టమైన వ్యూహాత్మక నిర్ణయమేనని తెలిపారు. టిబెట్‌తో పాటు హిమాలయ సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందని, సహజ వనరుల ద్వారా కీలక ప్రాంతాలపై నియంత్రణను మరింత బలపరచాలన్నదే బీజింగ్ లక్ష్యమని విశ్లేషించారు.

యార్లుంగ్ సాంగ్పో నది టిబెట్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత బ్రహ్మపుత్రగా మారి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం మీదుగా బంగ్లాదేశ్‌కు చేరుతుంది. ఈ నదిపై చైనా ఆనకట్ట నిర్మిస్తే భారత్‌కు చేరే నీటి ప్రవాహం 80–85 శాతం వరకు తగ్గే ప్రమాదం ఉందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ డ్యామ్ పూర్తిస్థాయిలో పనిచేస్తే, బ్రహ్మపుత్ర నదిలో నీరు ఎప్పుడు, ఎంత వదలాలన్నది చైనా నిర్ణయించే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే అస్సాం, అరుణాచల్ ప్రాంతాలు భారీ వరదల్లో మునిగిపోవచ్చు. అదే సమయంలో నీటిని నిలిపివేస్తే నది ఎండిపోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పర్యావరణం కాదు.. భద్రతా సమస్య

ఈ అంశం కేవలం పర్యావరణ సమస్యగా కాకుండా జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా మారింది. ఇప్పటికే భారత్–చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇప్పుడు నదుల నియంత్రణ కూడా మరో ఆయుధంగా మారుతోందన్న ఆందోళన పెరుగుతోంది. బ్రహ్మపుత్ర నది టిబెట్‌లో పుట్టి ఈశాన్య భారతానికి జీవనాధారంగా మారిన నేపథ్యంలో, దానిపై పైభాగంలో నియంత్రణ భారత్‌కు తీవ్ర సవాలుగా మారుతోంది.

అదనంగా, ఈ ఆనకట్ట భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతంలో నిర్మితమవుతుండటంతో ప్రమాదాల ముప్పు మరింత ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ చిన్న లోపం లేదా ప్రకృతి విపత్తు జరిగినా దాని ప్రభావం నేరుగా దిగువ ప్రాంతాలపై పడే అవకాశం ఉంది. అందుకే ఈశాన్య రాష్ట్రాల్లో దీనిని ‘వాటర్ బాంబ్’గా అభివర్ణిస్తున్నారు.

ప్రతిస్పందనగా భారత్ అడుగులు

చైనా ప్రాజెక్ట్‌కు ప్రత్యామ్నాయంగా భారత్ కూడా బ్రహ్మపుత్ర నదిపై తన వైపున ఆనకట్టలు నిర్మించాలన్న ఆలోచనలో ఉంది. బ్రహ్మపుత్ర బేసిన్ అంతటా సుమారు 208 జలవిద్యుత్ ప్రాజెక్టులు ప్రణాళికలో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) అదే నదిపై 11,200 మెగావాట్ల సామర్థ్యం గల మెగా డ్యామ్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ పరిణామాలు చూస్తే, భవిష్యత్తులో భారత్–చైనా మధ్య పోరు సరిహద్దులకే పరిమితం కాకుండా నదుల నియంత్రణ వరకూ విస్తరించే అవకాశం ఉందన్న చర్చలు ఊపందుకుంటున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Brahmaputra river Google News in Telugu Latest News in Telugu Three Gorges Dam Yarlung Tsangpo River

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.