భారత్‌పై ట్రంప్ టారిఫ్‌లు పెంచిన తర్వాత మన దేశానికి చైనా(China)తో సంబంధాలు బలపడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ (LAC) రేఖ వెంట శాంతిభద్రతలు కాపాడుకునేందుకు భారత్-చైనా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య సరిహద్దుల్లో శాంతి కొనసాగుతోంది. అయినప్పటీకి చైనా మాత్రం తన దొంగబుద్ధిని మార్చుకోవడం లేదు. టిబెట్‌లోని భారత సరిహద్దు సమీపంలో తమ సైనిక మౌలిక సదుపాయాలను విస్తరిస్తోంది. LAC వెంబడి చైనా మిలిటరీ అయిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) సైనిక వసతుల నిర్మాణాలు, లాజిస్టిక్స్ హబ్‌లను నిర్మస్తోంది.
Trump: ‘ముస్లిం బ్రదర్హుడ్’ సంస్థలపై ఉగ్ర ముద్ర: ట్రంప్
మానవ రహిత విమానాల, డ్రోన్ల పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు
తాజాగా చైనా టిబెట్‌లో మానవ రహిత విమానాల, డ్రోన్ల పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అమెరికా వైమానిక దళంలో భాగమైన ‘చైనా ఏరోస్పేస్ స్టడీస్ ఇన్‌స్టిట్యూట్’ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. దాదాపు 4300 మీటర్ల ఎత్తులో ఈ కేంద్రాన్ని నిర్మించిందని.. ఇందులో 720 మీటర్ల రన్‌వే, నాలుగు హ్యాంగర్లు, పరిపాలన భవంతులు ఉన్నట్లు అంచనా వేసింది. తాజాగా టిబెట్‌లో మానవ రహిత విమానాల, డ్రోన్ల పరీక్ష కేంద్రం, సైనిక వసతులు నిర్మాణ సౌకర్యాలను ఏర్పాటు చేయడం వల్ల డ్రాగన్ తమ సరిహద్దుల్లో బలగాన్ని పెంచుకుంటున్నట్లు సమాచారం.
చైనా ఎందుకు ప్రసిద్ధి చెందింది?
చైనా దాని పురాతన చరిత్రకు ప్రసిద్ధి చెందింది, ఇందులో గ్రేట్ వాల్ మరియు టెర్రకోట సైన్యం ఉన్నాయి, మరియు కాగితం, గన్‌పౌడర్ మరియు దిక్సూచి వంటి ఆవిష్కరణలతో ఆవిష్కరణలకు దాని సహకారాలు ఉన్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: