📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

China: చైనీయులకు వీసాల పునరుద్ధరణ

Author Icon By Anusha
Updated: July 23, 2025 • 2:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చైనాపై భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. చైనా పర్యటకులు, వ్యాపారవేత్తలు, ఇతర సందర్శకులకు వీసాలను, మంజూరు చేయాలని నిర్ణయించింది. కొత్త వీసాల జారీ ప్రక్రియను గురువారం నుంచి ప్రారంభం కానుంది.

ఐదు సంవత్సరాల అనంతరం పునరుద్ధరణ

చైనా సందర్శకులు, పర్యాటకులకు వీసాలను పునరుద్ధరించడం అయిదు సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2020లో వీటిని నిలిపివేసిన ప్రభుత్వం లడక్ తూర్పు ప్రాంతం,సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద గల గాల్వన్ వ్యాలీ (Galvan Valley) లో 2020 జూన్ 15, 16వ తేదీల్లో భారత్-చైనా సైనికుల మధ్యఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

20 మంది భారత జవాన్ల వీరమరణం

ఈ ఘటనలో 20 మంచి భారత జవాన్లు వీరమరణం పొందారు. ఆ ఘర్షణల్లోనే తెలంగాణకు చెందిన కల్నల్ బీకుమల్ల సంతోష్బాబు (Santoshbabu) అమరుడయ్యారు. ఈ ఉదంతం అనంతరం అప్పట్లో భారత ప్రభుత్వం వీసాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలు జరిగినప్పటి నుంచి వాస్తవాధీన రేఖ వద్ద యుద్ధ వాతావరణంకొనసాగుతూనే వచ్చింది.

శాంతిమార్గం వైపు అడుగులు

రెండు దేశాల మధ్య కొనసాగుతోన్న విభేదాలను రూపుమాపేలా, శాంతియుత వాతావరణం నెలకొల్పేలాముందడుగు వేశారు. మూడుదశల్లో బలగాలను వెనక్కి పిలిపించుకోవడానికి రెండుదేశాల సైన్యాధికారుల మధ్య అంగీకారం కుదిరింది. ఈ క్రమంలో విదేశాంగ శాఖమంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఇటీవలే చైనా (China) లో అడుగుపెట్టారు.బీజింగ్ లో అదేశాధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశం అయ్యారు. 2024 అక్టోబరులో రష్యాలోని కజాన్లో జరిగిన మోది-జిన్ పింగ్ శిఖరాగ్ర సమావేశం వంటి దౌత్యప్రయత్నాలు జరిగాయి. అవన్నీ కూడా సత్ఫలితాలను ఇచ్చాయి.

భిన్నాభిప్రాయాలు

వాస్తవాధీన రేఖ వవెంబడి దళాల ఉపసంహరణ, 2020కి ముందున్న గస్తీ ఏర్పాట్లను పునరుద్ధరించడం వంటిఅంశాలపై ఇరుదేశాలు అంగీకారానికి వచ్చాయి. ఈ పరిణామంపై సోషల్మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలువ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈ పరిణామాలపై హర్షం వ్యక్తం చేస్తుండగా మరికొందరు చైనాను నమ్మవద్దని అంటున్నారు. చైనా గవర్నమెంట్ మాత్రం నమ్మకూడదని చెబుతున్నారు.

చైనా దేశం ఎక్కడ ఉంది?

చైనా దేశం ఆసియా ఖండంలో ఉంది. ఇది ప్రపంచంలో జనాభా అత్యధికంగా ఉన్న దేశం రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా గుర్తింపు పొందింది.

చైనా రాజధాని ఏది?

చైనా రాజధాని బీజింగ్ (Beijing).

Read hindi news: hindi.vaartha.com

Read Also: Passports : పాస్‌పోర్టుల జాబితాలో మెరుగుపడిన భారత్‌ ర్యాంక్‌

China tourists visa restoration Galwan Valley 2020 India China clash India China Relations India tourism update Ladakh border issue Telugu News tourist visa news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.