📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

China: భారత్‌ సరిహద్దుల వెంట చైనా ప్రాజెక్టుల నిర్మాణం

Author Icon By Vanipushpa
Updated: August 12, 2025 • 12:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత సరిహద్దు(India Border)ల వెంట వరుసగా వివాదస్పద నిర్మాణాలు చేపడుతూనే ఉంది. ఇప్పటికే టిబెట్‌(Tibet)లోని యార్లంగ్‌ జాంగ్బో (బ్రహ్మపుత్ర)(Bhramhaputra) నదిపై ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిన చైనా తాజాగా మరో కీలక ప్రాజెక్టుకు సన్నద్ధమవుతోంది. భారత సరిహద్దు సమీపంలో భారీ రైల్వేలైన్‌ పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. టిబెట్‌ను షిన్‌జాంగ్‌ ప్రావిన్స్‌తో కలుపుతూ ఈ రైల్వే లైన్‌ను నిర్మించనున్నది. ఈ రైల్వే మార్గంలోని కొంత భాగం వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి వెళ్లనున్నాయి. దీంతో భారత్‌ సరిహద్దు ప్రాంతంలో రక్షణపరమైన సమస్యలు తలెత్తె అవకాశం ఉందని భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

China: భారత్‌ సరిహద్దుల వెంట చైనా ప్రాజెక్టుల నిర్మాణం

సరిహద్దు ప్రాంతంలో రక్షణపరమైన సమస్యలు
షిన్‌జాంగ్‌లోని హోటాన్, టిబెట్‌లోని లాసాల ప్రాంతాలను కలుపుతూ ఈ రైల్వే లైన్‌ పనులు చేపట్టనున్నారు. దీని నిర్మాణ పనులు ఈ ఏడాది ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తన కథనంలో తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 95 బిలియన్‌ యువాన్ల (రూ.1.15 లక్షల కోట్లు)మూలధనాన్ని ఖర్చు చేయనుంది. ఈ నిర్మాణానికి ‘ది షిన్‌జాంగ్‌-టిబెట్‌ రైల్వే కంపెనీ’ని అధికారికంగా రిజిస్టర్‌ చేసినట్లు చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘షాంఘై సెక్యూరిటీస్‌ న్యూస్‌’ వెల్లడించినట్లు తన కథనంలో వివరించింది. ఈ రైల్వే మార్గంలోని కొన్ని భాగాలు చైనా-భారత్ సరిహద్దులోని ఎల్‌ఓసీ సమీపం నుంచి వెళ్లనున్నాయి. దీని మూలంగా సరిహద్దు ప్రాంతంలో రక్షణపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో తూర్పు లడఖ్‌లో భారత్‌- చైనా సైనికుల మధ్య ఏర్పడిన ఘర్షణ ఏర్పడిన విషయం తెలిసిందే.
భారీ జల విద్యుత్తు ప్రాజెక్టు కూడా
ఇప్పటికే చైనా ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణాన్ని చైనా మొదలు పెట్టింది. శనివారం మొదలైన ఈ ప్రాజెక్టు పనుల కార్యక్రమంలో చైనా ప్రధాని లీ కియాంగ్‌ కూడా పాల్గొన్నారు. టిబెట్‌లోని యార్లంగ్‌ జాంగ్బో (బ్రహ్మపుత్ర) నదిపై ఈ వివాద స్పద ప్రాజెక్టును చేపడుతోంది. దీనికోసం చైనా దాదాపు 1.2 ట్రిలియన్‌ యువాన్‌లు (సుమారు రూ.14లక్షల కోట్లు) ఖర్చు పెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా ‘చైనా యాజియాంగ్‌ గ్రూపు’ పేరుతో కొత్తగా ఓ సంస్థను ఏర్పాటు చేసిన చైనా ప్రాజెక్టు నిర్మాణ పనులను దానికి అప్పజెప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో మొత్తం ఐదు డ్యామ్‌లు ఉంటాయని తెలుస్తోంది.
డ్యామ్‌ నిర్మాణం వల్ల పర్యావరణానికి తీరని నష్టం
చైనా ఈ ప్రాజెక్టును భారీ ఖర్చుతో చేపడుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్టుగా ఇది నిలువనుంది. దీనిద్వారా ఏటా 300 బిలియన్‌ కిలోవాట్‌-అవర్స్‌ విద్యుత్తును ఉత్పత్తి చేయాలన్నది చైనా లక్ష్యం. ఇది చైనా గతంలో నిర్మించిన త్రీగోర్జెస్‌ డ్యామ్‌కన్నా మూడురెట్లు పెద్దది. బ్రహ్మపుత్ర నది ‘గ్రేట్‌ బెండ్‌’గా పిలిచే ప్రాంతంలోని భారీ వంపు ప్రాంతంలో రెండువేల మీటర్ల దిగువకు ప్రవహిస్తుంది. దానికి స్వల్పదూరంలో నిటారుగా నీళ్లు పడటంవల్ల అక్కడ జల విద్యుత్తు ఉత్పత్తికి అవకాశాలున్నాయి.

చైనా, భారతదేశం మధ్య సంబంధం ఏమిటి?
భారతదేశం మరియు చైనా సహకారం మరియు పోటీ రెండింటి ద్వారా వర్గీకరించబడిన సంక్లిష్ట సంబంధాన్ని పంచుకుంటాయి, ముఖ్యంగా వాణిజ్యం, సరిహద్దు వివాదాలు మరియు ప్రాంతీయ ప్రభావం వంటి రంగాలలో. వారు ఒకరికొకరు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములు అయినప్పటికీ, దీర్ఘకాలిక సరిహద్దు వివాదం మరియు ఒకరి ప్రభావం పెరుగుతున్నందుకు పరస్పర ఆందోళనల వల్ల కూడా ఈ సంబంధం దెబ్బతింటుంది.
భారతదేశం మరియు చైనా మధ్య సంఘర్షణకు ప్రధాన కారణం ఏమిటి?
పరస్పరం గుర్తించబడిన సరిహద్దు ఒప్పందాలు లేకపోవడం వలన ఉద్రిక్తతలు మరియు అప్పుడప్పుడు సైనిక ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతాలలో మొదటిది, అక్సాయ్ చిన్, చైనా ఆధీనంలో ఉంది మరియు భారతదేశం దానిని క్లెయిమ్ చేసుకుంటోంది; ఇది ఎక్కువగా జనావాసాలు లేని ఎత్తైన బంజరు భూమి, కానీ అంచులలో కొన్ని ముఖ్యమైన పచ్చిక బయళ్ళు ఉన్నాయి.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/high-tension-in-america-national-guard-deployed/international/529317/

border tensions Chinese projects Geopolitics India-China border Infrastructure security Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.