📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి!

Brahmaputra River : బ్రహ్మపుత్ర నదిపై చైనా ‘మెగా డ్యామ్‌’ నిర్మాణం

Author Icon By Divya Vani M
Updated: July 20, 2025 • 8:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చైనా (China) మరోసారి మాస్ ప్రాజెక్ట్‌తో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. శనివారం టిబెట్‌లో బ్రహ్మపుత్ర నది (Brahmaputra River in Tibet) పై అత్యంత ఖరీదైన జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి చైనా ప్రధాని లి కియాంగ్ హాజరయ్యారు. స్థానిక మీడియా ఇది ధ్రువీకరించింది.యార్లుంగ్ త్సాంగ్పో (బ్రహ్మపుత్ర) నదిపై ఈ ప్రాజెక్టును డిసెంబర్‌లో చైనా ఆమోదించింది. నదిపై భారీ ఆనకట్ట నిర్మించడానికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుతో దేశంలోని వివిధ ప్రాంతాలకు విద్యుత్ పంపిణీ చేయనుంది. టిబెట్ ప్రాంత ప్రజలకు విద్యుత్ అవసరాలు తీరుతాయని చైనా చెబుతోంది.

Brahmaputra River : బ్రహ్మపుత్ర నదిపై చైనా ‘మెగా డ్యామ్‌’ నిర్మాణం

చైనాపై భారత్‌, బంగ్లాదేశ్ అభ్యంతరం

ఈ ప్రాజెక్టు డ్రాగన్‌ దేశం చేపట్టిన తీరు భారత్‌, బంగ్లాదేశ్‌కి ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే బ్రహ్మపుత్ర నది ఈ రెండు దేశాల్లోనూ ప్రవహిస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల లక్షల మంది దిగువ ప్రాంత ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. చైనా మాత్రం ఎలాంటి చర్చలు లేకుండానే ముందుకెళ్తోంది.
జనవరిలోనే ఈ ప్రాజెక్టుపై ఆందోళన వ్యక్తం చేసిందని భారత్ తెలిపింది. దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. బ్రహ్మపుత్ర ప్రవాహం తగ్గకుండా చూడాలని చైనాను కోరింది. ఎలాంటి ప్రతికూల ప్రభావం రాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

పర్యావరణ హాని పై పక్కా హెచ్చరికలు

ఈ మెగా ప్రాజెక్టుపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టిబెట్ పీఠభూమి పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతం. ఇలాంటి ప్రాజెక్టులు దీర్ఘకాలిక ముప్పుగా మారతాయని వారు హెచ్చరిస్తున్నారు. ఇది దిగువన ఉన్న జీవవైవిధ్యం, నీటి వనరులపై తీవ్ర ప్రభావం చూపొచ్చని అభిప్రాయపడ్డారు.ఈ ప్రాజెక్టులో భాగంగా చైనా ఐదు జలవిద్యుత్ కేంద్రాలను నిర్మించనుంది. మొత్తం ఖర్చు సుమారు 1.2 ట్రిలియన్ యువాన్లు. అంటే దాదాపు ₹14 లక్షల కోట్లు. ఇది చైనా చరిత్రలోనే అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా నిలవనుంది.

Read Also : Vietnam Boat Accident : వియత్నాంలో పడవ బోల్తా పడి 34 మంది మృతి

Brahmaputra River Dam Telugu Brahmaputra River Mega Dam China Dam Construction News China Himalayan Dam Project China Mega Dam Under Construction China Project on Brahmaputra River China Water Strategy Impact on India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.