📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

China: అమెరికాకు చైనా అణురహస్యాలు లీక్..విచారణకు ఆదేశం

Author Icon By Vanipushpa
Updated: January 26, 2026 • 3:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చైనా రాజకీయ, సైనిక వర్గాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అత్యంత నమ్మకస్తుడిగా, సైన్యంలో అత్యున్నత హోదాలో ఉన్న జనరల్ జాంగ్ యూక్సియా (75)పై చైనా(China) ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆయనపై అవినీతి ఆరోపణలే కాకుండా అత్యంత సున్నితమైన అణ్వాయుధ రహస్యాలను అమెరికాకు చేరవేరారన్న సంచలన ఆరోపణలు రావడం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయింది.
వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ ఛైర్మన్ హోదాలో ఉన్న జాంగ్ యూక్సియాపై అణ్వాయుధ కార్యక్రమానికి సంబంధించిన ‘కోర్ టెక్నికల్ డేటా’ను అమెరికాకు లీక్ చేశారన్న ప్రధాన ఆరోపణ ఉంది. దీంతో పాటు సైనిక పదవుల కేటాయింపులో భారీగా లంచాలు తీసుకోవడం, సొంత వర్గాలను ఏర్పాటు చేయడం, సైనిక కొనుగోళ్లలో అవినీతికి పాల్పడటం వంటి తీవ్రమైన ఉల్లంఘనలపై ప్రభుత్వం అంతర్గత విచారణ జరుపుతోంది.

Read Also: India: పాకిస్థాన్‌కు షాకిచ్చిన యూఏఈ

China: అమెరికాకు చైనా అణురహస్యాలు లీక్..విచారణకు ఆదేశం


అధ్యక్షుడి భద్రతా దళాలకు, సైన్యానికి మధ్య ఘర్షణలు

ఈ పరిణామాల నేపథ్యంలో చైనాలో సైనిక తిరుగుబాటు జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అధ్యక్షుడి భద్రతా దళాలకు, సైన్యానికి మధ్య ఘర్షణలు జరిగాయని.. వేలాది మంది సైనికులను అదుపులోకి తీసుకున్నారన్న వార్తలు వెలువడినా చైనా ప్రభుత్వం కానీ, పాశ్చాత్య నిఘా సంస్థలు కానీ వీటిని ధృవీకరించలేదు. అయితే షీ జిన్‌పింగ్ చేపట్టిన సైనిక ప్రక్షాళనలో భాగంగానే 2023 నుంచి ఇప్పటి వరకు 50 మందికి పైగా ఉన్నతాధికారులు పదవులు కోల్పోవడం గమనార్హం. చైనా సైనిక నాయకత్వంలో వస్తున్న ఈ మార్పులు భారత్‌కు అత్యంత కీలకంగా మారుతున్నాయి. వాస్తవాధీన రేఖ (LAC) వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో.. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) అంతర్గత అస్థిరత భారత్ భద్రతపై ప్రభావం చూపుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

China nuclear secrets China US relations Defense Secrets espionage controversy global security threat international security nuclear leak Telugu News Paper Telugu News Today US investigation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.